Suryaa.co.in

Andhra Pradesh

ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చివరకు ఇలాగే ఉంటుంది

– చట్టబద్ధంగానే పోసానిని పోలీసులు అరెస్ట్ చేశారు
– మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి: చట్టబద్ధంగానే పోసానిని పోలీసులు అరెస్ట్ చేశారని, పోసాని మాట్లాడిన తీరును రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోరని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చివరకు ఇలాగే ఉంటుందని, ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి అసహ్యంగా, నీచంగా మాట్లాడాడని, ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే ఏ ఒక్కరినీ కూటమి ప్రభుత్వం వదలదని కొల్లు హెచ్చరించారు.

రెడ్ బుక్ రాజ్యాంగాన్నే అమలు చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే అందరినీ లోపలకు పంపించేవాళ్లమని చెప్పారు. వైసీపీ నేతలు చేసిన పాపాలే వాళ్లను వెంటాడుతున్నాయి.

తమ ప్రభుత్వ హయాంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, మాజీ మంత్రి పేర్ని నాని ఫ్రస్టేషన్ లో ఉన్నారని, ఆయన భార్య జయసుధ అకౌంట్ లోకి డబ్బులు ఎలా జమ అయ్యాయో త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు. కాకినాడ షిప్పుల్లో బియ్యం అక్రమంగా ఎలా రవాణా అయిందో వివరాలన్నీ ఉన్నాయని కొల్లు రవీంద్ర తెలిపారు.

LEAVE A RESPONSE