– ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట: స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్క పట్టభద్రుడికి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో 9 పోలింగ్ బూత్ లు ఉన్నాయని మొత్తం 6250 మంది ఓటర్లు ఉండగా 4,615 ఓటు హక్కు వినియోగించుకున్నారని జగ్గంపేట నియోజకవర్గంలో 74 శాతం పోలింగ్ నమోదయిందని అన్నారు.