– రాష్ట్రంలో రాక్షస పాలన
-ముస్లింల సంక్షేమాన్ని గాలికొదిలోసిన వైసీపీ ప్రభుత్వం
– నెల్లూరులో గోవా మద్యం వ్యాపారం వెనుక వైసీపీ నేతలు..వారికి అది అలవాటైన వ్యాపారమే
ఏపీ ప్రతిష్టను పాతిపెడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది
– నెల్లూరులోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించిన జగన్ సర్కార్ పై ముస్లింల సమర భేరి కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చిన ముస్లిం సోదరి, సోదరులకు ధన్యవాదములు. మూడేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు-ఘోరాల్లో మైనార్టీలకు కూడా మినహాయింపు లేకుండా పోయింది. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోను చూస్తే ప్రతి ఒక్కరికీ కన్నీరు వస్తాయి.
పలమనేరులో తన కుమార్తె కన్నా ముస్లిం విద్యార్థిని చదువులో టాపర్ గా ఉండటాన్ని భరించలేని వైసీపీ నాయకుడు ఆ మైనార్డీ బిడ్డ ఆత్మహత్యకు కారకులయ్యారు.కసుమూరులో ఖయ్యూం భాయ్ అనేక ఏళ్లుగా సర్వేపల్లి రోడ్డులో నిర్వహించుకుంటున్న టీ దుకాణాన్ని కూల్చేసి బతుకుదెరువు లేకుండా చేసేశారు.చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలెన్నో.
వైసీపీ పాలనలో సీఎం నిర్ణయాలు ఓ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంటే ఆ పార్టీ నేతలు చేస్తున్ఘోరాలు మరో విధంగా ఏపీకి ఉన్న బ్రాండ్ ను చెడగొడుతున్నాయి.ఎక్కడైనా ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారడం చూశాం కానీ వాటిని పూర్తిగా ఆపేయడాన్ని జగన్ రెడ్డి పాలనలోనే చూస్తున్నాం.పెళ్లి కానుకలు, పండగ కానుకలు, రంజాన్ తోఫాలు, దుల్షన్ లేదు…చంద్రన్న బీమా పథకానికి చరమగీతం పాడేశారు.ముస్లింల అభ్యున్నతిలో కీలకంగా వ్యవహరించే మైనార్టీ కార్పొరేషన్ ను మూడేళ్లుగా నిర్వీర్యం చేసేశారు.విదేశీ విద్య పథకాన్ని అర్థంతరంగా నిలిపేయడంతో అనేక మంది మధ్యలోనే చదువులు ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఏపీలోని కొందరు పోలీసులు చట్టపరిధిలో పనిచేయడం మానేసి వైసీపీ నేతల గుమస్తాలుగా మారిపోయారు.రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తుంటే ప్రజలు ఇక ఎవరిని ఆశ్రయించాలి.ప్రధాన ఆదాయ వనరుగా మద్యాన్ని మార్చుకుని పాలన సాగించే పరిస్థితికి రావడం దురదృష్టకరం.మద్యం పేరుతో స్లోపాయిజన్ అమ్మి ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నారు.
ఏడాదికి రూ.3500 కోట్ల ఆదాయం తన సొంత ఖజానాకు జమయితే చాలు, ప్రజల ప్రాణాలు ఎటుపోతే తనకెందుకనే ధోరణిలో జగన్ రెడ్డి ఉన్నారు.మొన్న గోవా మందు, నిన్న పాండిచేరి మందు…నెల్లూరులో పొరుగు రాష్ర్టాల మద్యం ఏరులై పారుతోంది.పెద్దల హస్తం లేకుండా గోవా నుంచి రూ.20కి చీప్ లిక్కర్ ను తెచ్చి నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పబ్లిక్ గా విక్రయించడం సాధ్యం కాదు.
గోవా నుంచి నాసిరకమైన మద్యం తేవడం మన నెల్లూరోళ్లకు కొత్తకాదు.2014లోనూ అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు ఇంటర్నేషనల్ స్మగ్లర్ల ముఠాతో కలిసి గోవా నుంచి మద్యం తెచ్చారు.ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతులకు ఈ రోజు కనీస మద్దతు ధర గగనమైపోయింది.
దళారులు, వైసీపీ నేతలు మాత్రం రైతులను మోసం చేస్తూ తక్కువ ధరకు కొని ఎక్కువకు అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నారు.
నాలుగైదు రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిపివేసినా పట్టించుకునే వారు కరువయ్యారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో క్రిష్ణపట్నం థర్మల్ ఫ్రాజెక్టులో ఏర్పాటైన యూనిట్ తో పాటు చంద్రబాబు నాయుడు
చేపట్టిన యూనిట్ ను కూడా జగన్ రెడ్డి లీజు పేరుతో ప్రైవేటుకు ధారాదత్తం చేయడం దుర్మార్గం. కృష్ణపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 70 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నా ఈ జగన్ రెడ్డికి పట్టకపోవడం బాధాకరం.
బహిరంగ మార్కెట్ లో ఈ రోజు యూనిట్ రూ.20కి ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ ను తయారు చేసుకునే ప్రభుత్వ ప్లాంటును ప్రైవేటుకు అప్పగించడానికి జగన్ రెడ్డికి మనస్సు ఎలా వస్తుందో?జగన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా పల్లె నుంచి నగరం వరకు విద్యుత్ కోతలతో చీకట్లలో చిక్కుకునే పరిస్థితి వస్తోంది.
కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మాజీ మంత్రి వర్యులు ఎన్ఎండీ ఫరూక్, కడప జిల్లా అధ్యక్షులు అమీర్ బాబు, ఇంతియాజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కంభం విజయరామిరెడ్డి, తాళ్లపాక అనూరాధ, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి , బోమ్మి సురేంద్ర, వేనాటి సతీష్ రెడ్డి, విజేత రెడ్డి, జెడ్. శివప్రసాద్, సాబీర్ ఖాన్, మైనుద్దీన్, మాలేపాటి సుబ్బానాయుడు,రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు ముష్ఠాక్ అహమద్, మాజీ ఎమ్మెల్యే చాన్ బాషా, జాతీయ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి నజీరుల్ల, ఫతాఉల్ల,, కరిముల్ల, పర్వీన్ తాజ్, అషా, అజీమూన్, మోహ్సిన్, బషీర్ తదితరులు పాల్గొన్నారు..