నేర చరితులకు టీటీడీ పదవులు ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం

103

అమరావతి : నేర చరితులకు టీటీడీ పదవులు ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.నేరచరిత్ర ఉన్న వారిని బోర్డు సభ్యులుగా నియమించడంపై హైకోర్టులో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.

వాయిదాపై పిటిషనర్‌ తరపు లాయర్‌ అశ్వనీకుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.కేసు వివరాలను ధర్మాసనానికి అశ్వనీకుమార్‌ వివరించారు.నేరచరితులను ఎలా నియమిస్తారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

అశ్వనీకుమార్‌ వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నాయని భావిస్తున్నామని, కనీసం కొంత మందినైనా తొలగించాల్సిందేనని హైకోర్టు పేర్కొంది.టీటీడీ భవనం కలెక్టరేట్‌ అవసరాలకు వాడుకుంటే..విధానపరమైన నిర్ణయం కాబట్టి సమర్థించామని కోర్టు తెలిపింది.

కానీ నేరచరిత్ర ఉన్న సభ్యులు పాలకవర్గంలో ఉండొద్దని సూచించింది.ఏప్రిల్‌ 19న వాదనలు వింటాం.. అదే రోజు నిర్ణయం కూడ తీసుకుంటామని హైకోర్టు తెలిపింది.ఇక ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపులు ఉండబోవని కోర్టు స్పష్టం చేసింది.