-కదిలిన రెవెన్యూ యంత్రాంగం
-ఫలించిన ‘”నేనుసైతం”‘ *పోరాటం
-కోయిల్ కొండ తహసీల్దార్, ఆర్ఐల సస్పెన్షన్
-కలెక్టర్ వెంకట్రావ్ ఋణపడివుంటాం
-పోలీస్ అధికారులపై చర్యలు ఏవి….?
-సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ కొండ మండలంలో ఇసుక అక్రమ రవాణను అరికట్టాలని, ఇసుక మాఫీయాపై ఉక్కుపాదం మోపాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఈ నెల 25న సామాజిక కార్యకర్త,
నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం (30-03-2022) కోయిల్ కొండ తహసీల్దార్ ప్రకాష్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ అరుణలను కలెక్టర్ వెంకట్రావ్ సస్పెండ్ చేయడం హర్షణీయం అన్నారు.
గురువారం నేనుసైతం స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పిర్యాదుపై కలెక్టర్ వెంకట్రావ్ వెంటనే స్పందించి విచారణ చేపట్టి ఇద్దరి అవినీతి అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని స్వాగతిస్తున్నామని ప్రవీణ్ తెలిపారు.
అంతేకాకుండా కలెక్టర్ వెంకట్రావ్ కు నేనుసైతం స్వచ్ఛంద సంస్థ ఋణపడివుంటుందని ఆయన చెప్పారు. ఈలాంటి కఠిన చర్యలతోనైనా ఇసుక అక్రమ రవాణాకు సహకరించే ప్రభుత్వ, రెవిన్యూ అధికారుల ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు ఇసుక మాఫియాకు సహకరించేందుకు భయపడుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గత 10 ఏళ్లుగా పోరాడుతున్నాం ప్రవీణ్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఇసుక అక్రమ రవాణా, ఇసుక మాఫియాపై గత 10 ఏళ్లుగా పోరాడుతున్నామని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ
అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ ప్రతాప్, రియాలిటీ ఇన్స్పెక్టర్ రవి కుమార్ లను తమ పోరాట ఫలితంగానే సస్పెండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా తమ పోరాట ఫలితంగా గత 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఇసుక మాఫియాకు సహకరిస్తున్న ఎంతో మంది రెవిన్యూ, పోలీస్, మైనింగ్ శాఖ అధికారులపై సస్పెన్షన్ లతో పాటు వీఆర్, ఆటాచమెంట్, ఛార్జ్ మెమోలతో పాటు పలు కఠిన చర్యలు తీసుకొవడం జరిగిందని ఆయన తెలిపారు.
పోలీస్ అధికారులపై చర్యలు ఏవి….?
ఇదిలావుంటే ఇసుక అక్రమ రవాణాకు సహకరించిన కోయిల్ కొండ పొలీస్ అధికారులపై మాత్రం నేటికి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న సందర్భంలో స్వయంగా ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అంకిళ్ళ వాగు దగ్గర ఉండి మరీ ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం దురదృష్టకరం. ఇదిలాఉంటె ఇసుక అక్రమ రవాణా మాట వాస్తమేనని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తాము వెళ్ళే సరికే ట్రాక్టర్ యజమానులు వెళ్లిపోయారని కాకమ్మ కథలు చెప్పిన కోయిల్ కొండ ఎస్ఐ శీనయ్యపై నేటికి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకవైపు ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో రెవిన్యూ అధికారులపై కలెక్టర్ వెంకట్రావ్ సస్పెన్షన్ చర్యలు తీసుకోగా, కోయిల్ కొండ పోలీస్ అధికారులపై మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు ఇకనైనా చర్యలు తీసుకుంటారో…. లేదో…. వేచిచూద్దాం.