Suryaa.co.in

Andhra Pradesh

బీసీలంతా బాబును నిలదీయాలి

-ఇన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలొస్తే.. బాబు కౌంటర్ పెట్టి అమ్మేవాడు
-మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

తాడేప‌ల్లి: బీసీలంతా చంద్ర‌బాబును నిలదీయాల‌ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలొస్తే.. బాబు కౌంటర్ పెట్టి అమ్మేవాడ‌న్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలవారు పాలకులుగా మారితే .. సమ సమాజం సాకారం అవుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కలలుగన్నట్టుగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిగారు అడుగడుగునా సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నారు. అంబేడ్కర్ గారి కలలను నిజం చేస్తున్నారు.

– అన్నింటా బీసీలకు పెద్ద పీట వేసి, ఏలూరు బీసీ డిక్లరేషన్ లో చెప్పిన దానికంటే మించి చేస్తూ, బీసీల గౌరవాన్ని పెంచిన గొప్ప ముఖ్యమంత్రి జగన్
– అదే, గతంలో 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. బీసీలకు అంత చేశాం.. ఇంత చేశాం అని ఇంకా టీడీపీ డబ్బా కొట్టుకోవడం విచిత్రంగా ఉంది. బీసీలకు రాజ్యసభ స్థానాలను, ఎమ్మెల్సీ స్థానాలను ఎందుకు ఇవ్వలేకపోయావు అని బీసీలంతా చంద్రబాబును నిలదీయాలి.
– అదే జగన్ మోహన్ రెడ్డిగారు.. 55 మంది బీసీలకు ఎమ్మెల్యేలుగా స్థానం కల్పించి, నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి, బీసీల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
– 14 ఏళ్ళు బాబు సీఎంగా ఉన్నప్పుడు బీసీలకు మీరు ఏం చేసిందీ, ఈ నాలుగేళ్ళలో బీసీలకు మా ముఖ్యమంత్రి జగన్ గారు ఏం చేసిందీ.. గణాంకాలతో సహా చూపిస్తాం.. చర్చకు వచ్చే ధైర్యం మీకు అందా..? అని సవాల్ విసురుతున్నాను. నిర్మాణాత్మకంగా బీసీలకు ఫలానా మేలు చేశామని చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు, టీడీపీ నేతలు ఉన్నాడు.
– ఇప్పుడు 18 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలు వస్తే.. 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జగన్ మోహన్ రెడ్డిగారు స్థానం కల్పించారు.
– ఇదే విధంగా చంద్రబాబు హయాంలో ఇన్ని ఖాళీలు వస్తే.. ఆయన గల్లా పెట్టి ఓపెన్ చేసి, కౌంటర్ పెట్టి మరీ, ఆ సీట్లన్నింటినీ ధనవంతులకు అమ్మేసుకునేవాడు.
– బీసీలకు ఇన్ని రాజ్యసభ స్థానాలు, ఎమ్మెల్సీలు, ఇతర పదవులు రావడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. అది ఒక్క జగన్ గారి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది. గతంలో, 1973లో తిరుపతి నుంచి ఒక ఎస్టీ మహిళకు అవకాశం ఇస్తే… మళ్ళీ ఇప్పుడు రవిబాబును జగన్ గారు ఎమ్మెల్సీని చేశారు. వడ్డెర కులస్థులకు ఎమ్మెల్సీ ఇచ్చిన నాయకుడు జగన్ గారు. ఇంత గొప్ప ముఖ్యమంత్రి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
– చంద్రబాబు నాయుడు హయాంలో.. బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూశారు. కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రగిల్చి, రాష్ట్రంలోని అన్ని వర్గాలను చంద్రబాబు తగలబెట్టారు.
– చిన్న వయసులోనే బీసీలకు ఎంతో చేస్తున్న జగన్ గారిపై, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినా ఏమీ చేయలేకపోయాయనే ఈర్ష్యా, ద్వేషాలతో చంద్రబాబు రగిలిపోతున్నాడు.
– టీడీపీ నేతలు కూడా జగనన్న చేస్తున్న మేలును గొంతెత్తి చెబుతున్నారు. బీసీలను అణగదొక్కిన టీడీపీ సమాధి అవుతుంది. ఇక ఆ పార్టీలో చంద్రబాబు, లోకేశ్ మాత్రమే మిగులుతారు.
– ఈ మూడున్నరేళ్ళలో ఏకంగా 85 వేల మందికిపైగా బీసీలకు వేర్వేరు పదవులు ఇచ్చిన నాయకుడు జగన్ గారే. దాంతో ఎక్కడ చూసినా, బీసీ కళ్ళల్లో ఆనందం తొణికిసలాడుతుంది.
– బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెడితే.. వ్యతిరేకించిన చంద్రబాబు బీసీల గురించి మాట్లాడే హక్కు ఉందా..?
– చంద్రబాబు బీసీలను రాజకీయంగా వాడుకుని వదిలేయడం తప్పితే.. బీసీలకు చేసింది ఏమీ లేదు.
– చంద్రబాబు 5 ఏళ్ళలో.. బీసీలకు అప్పులుగా ఇచ్చింది 35 వేల కోట్లు అయితే.. ఈరోజు జగనన్న పరిపాలనలో డీబీటీ ద్వారా నేరుగా 95 వేల కోట్లకు పైగా బీసీలకు పంచారు. పదవుల్లోనూ బీసీలకు పెద్ద పీట వేస్తున్నారు. ఇంత చేస్తున్న జగనన్నను బీసీలు అంతా గుండెల్లో పెట్టుకుంటున్నారు.

LEAVE A RESPONSE