– రెండో స్థానం బీజేపీదే
– కాంగ్రెస్‌కు ముచ్చటగా మూడోస్థానమేనట
( మార్తి సుబ్రహ్మణ్యం)
అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం, టీఆర్‌ఎస్‌కు అనుకూలంగానే ఉంటుందని అన్ని సర్వే సంస్థలూ తేల్చాయి. ఆ మేరకు అవి నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. బీజేపీ రెండో స్థానం, కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం అవుతాయన్నది వాటి నివేదికల సారాంశం. బీఎస్పీ పోటీ వల్ల, కాగ్రెస్ దాదాపు 5 శాతం ఓటు కోల్పోతుందన్నది సర్వే సంస్థల నివేదికలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌పై.. బీజేపీ-కాంగ్రెస్ ప్రచార అస్త్రాలు పనిచేయలేదని, అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ, రూరల్ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ను ఆదరించినట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి. కమలం కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, కాంగ్రెస్‌కు అభ్యర్ధి మైనస్ పాయింటన్నది సర్వే సంస్థల అభిప్రాయం. మనుగోడు ఉప ఎన్నిక ఫలితంపై వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్‌పోల్ సర్వే నివేదిక ఇదీ..
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. ఇక, మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్ సర్వేలు తమ నివేదికలను వెల్లడిస్తున్నాయి.ఎన్నికల సరళిపై పలు సర్వేలు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, గెలుపు ఎవరిది అనే దానిపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి..
థర్డ్ విజన్ రీసెర్చ్- నాగన్న ఎగ్జిట్‌పోల్స్ సర్వే ప్రకారం..
టీఆర్‌ఎస్- 48-51 శాతం
బీజేపీ- 31-35 శాతంకాంగ్రెస్- 13-15 శాతం
బీఎస్పీ- 5-7 శాతం
ఇతరులు- 2-5 శాతం..
ఎస్‌ఏఎస్ గ్రూప్ ఎగ్జిట్‌పోల్ సర్వే ప్రకారం..
టీఆర్‌ఎస్- 41-42 శాతం
బీజేపీ- 35-36 శాతం
కాంగ్రెస్- 16.5-17.5 శాతం
బీఎస్పీ- 4-5 శాతం
ఇతరులు- 1.5-2 శాతం..
నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ఎగ్జిట్‌పోల్ సర్వే ప్రకారం..
టీఆర్‌ఎస్- 42.11 శాతం
బీజేపీ- 35.17 శాతం
కాంగ్రెస్- 14.07 శాతం
బీఎస్పీ- 2.95 శాతం
ఇతరులు- 5.70 శాతం.
పల్స్ టుడే సర్వే ప్రకారం..
టీఆర్‌ఎస్- 42-43 శాతం
బీజేపీ- 38.5 శాతం
కాంగ్రెస్- 14-16 శాతం
బీఎస్పీ- 3 శాతం
ఇతరులు – 1 శాతం
తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక సర్వే ప్రకారం..
టీఆర్‌ఎస్- 40.9 శాతం
బీజేపీ- 31 శాతం
కాంగ్రెస్- 23 శాతం
బీఎస్పీ- 3.2 శాతం
మిర్రర్ ఆఫ్ పబ్లిక్ పల్స్ సర్వే ప్రకారం..
టీఆర్‌ఎస్- 42.13 శాతం
బీజేపీ-31.98 శాతం
కాంగ్రెస్- 21.06 శాతం
త్రిశూల్ సంస్థ సర్వే ప్రకారం..
టీఆర్‌ఎస్- 47 శాతం
బీజేపీ-31 శాతం
కాంగ్రెస్- 18 శాతం
రాజనీతి స్ట్రాటజీస్ సర్వే ప్రకారం…
టీఆర్‌ఎస్- 42 శాతం
బీజేపీ- 35 శాతం
కాంగ్రెస్- 15 శాతం
బీఎస్పీ- 4 శాతం
పొలిటికల్ ల్యాబోలేటరీ సంస్థ సర్వే ప్రకారం..
టీఆర్‌ఎస్- 41.7 శాతం
బీజేపీ- 38.6 శాతం
కాంగ్రెస్- 12.2 శాతం