– డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ : రంజాన్ పవిత్ర మాసంలో ముస్లింలకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో లాలాగూడ, వారసిగుడా ప్రాంతాల్లో రెండు హలీం కేంద్రాలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం చిలకలగుడా ఈద్గా ను సందర్శించారు. తెలంగాణా రాష్ట్రం లోనే మోడల్ గా నిలిచేలా ఈద్గాను తీర్చిదిద్దామని, దీని నిర్వహణకు ఏర్పాట్లు జరపాలని అయన అధికారులను ఆదేశించారు. బీ ఆర్ ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కట్టెల శ్రీనివాస్ యాదవ్, జహంగీర్, నీలా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.