మోదీ తలుచుకుంటే బీఆర్ఎస్ లో ప్రజా ప్రతినిధులు మిగిలేవారా?

2

-బీఆర్ఎస్ లో చేరితేనే నిధులిస్తామంటూ ప్రజా ప్రతినిధులను బెదిరించడం సిగ్గు చేటు
-మూతపడ్డ ఫైనాన్స్ దుకాణం కొత్త అవతారమే బీఆర్ఎస్
-బీఆర్ఎస్ లో చేరుతున్న నాయకులంతా చెల్లని కాసులే
-మహేశ్వరంలో అంతులేని బీఆర్ఎస్ నేతల భూకబ్జా
-ప్రజల సమస్యలను గాలికొదిలేసిన కేసీఆర్
-దొంగ సారా దందా కేసులో ఇరుక్కున్న కవితను అరెస్ట్ చేయాల్సిందే
-ఊళ్లల్లోకి పోయి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు చెప్పే దమ్ముందా?
-మజ్లిస్ నేతలవి బ్లాక్ మెయిల్ రాజకీయాలు
-అన్ని సీట్లలో పోటీ చేస్తామంటూ డబ్బులు దండుకోవడమే ఆ పార్టీ పని
-ఎంఐఎం నేతలకు దమ్ముంటే మహేశ్వరంసహా రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేయాలి
-బీజేపీని ఎదుర్కొనే సత్తా లేక అన్నీ పార్టీలు కుమ్మక్కై కుట్ర చేస్తున్నాయి

మహేశ్వరం నియోజకవర్గం అమీర్ పేట స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ ఫైర్….
గ్రామాల అభివ్రుద్ధి కోసం, ప్రజా సమస్యలు పరిష్కరానికి నిధులివ్వాలని అడుగుతున్న ప్రజా ప్రతినిధులను బీఆర్ఎస్ లో చేరితేనే నిధులిస్తామంటూ కేసీఆర్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండి పడ్డారు. ‘‘రాష్ట్రంలోని పంచాయతీల అభివ్రుద్ధికి నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమే. మీ లెక్క (బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి) నరేంద్రమోదీ గారు బీజేపీలోనే చేరితేనే పంచాయతీలకు నిధులిస్తామని చెబితే… బీఆర్ఎస్ లో ఒక్కరైనా మిగిలేవారా?’’అంటూ ప్రశ్నించారు. మహేశ్వరం మండలం అమీర్ పేటలో బుధవారం రాత్రి పొద్దుపోయాక నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, మండలాధ్యక్షులు మాధవాచారి, సర్పంచ్ శ్రీశైలం, నందీశ్వర్, యాదీశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే….

బీఆర్ఎస్ పార్టీ ముంచిన ఫైనాన్స్ కొత్త దుకాణమే. బీఆర్ఎస్ కు కార్యవర్గమే లేదు. ఇతర రాష్ట్రాల నుండి బీఆర్ఎస్ లో చేరుతున్న నాయకులంతా చెల్లని కాసులు. మునుగోడు ఎన్నికల్లో గెలిచేందుకు ఒక్కో బూత్ కు ఒక్కో ఎమ్మెల్యే, మంత్రిని నియమించిన టీఆర్ఎస్ కు బీజేపీ బూత్ ప్రెసిడెంట్ చాలు. బీజేపీ దెబ్బకు కేసీఆర్ నిద్ర పట్టక రాత్రింబవళ్లు తాగుతున్నడు. నిత్యం ఎట్లా ప్రజల నుండి దండుకోవాలనే తపనే తప్ప ఇండ్లు కట్టివ్వాలనే ఆలోచనే కేసీఆర్ కు లేదు. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టానికే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మీటింగులు పెట్టి బీజేపీ దమ్మేందో చూపిస్తున్నాం.

మహేశ్వరంలో టీఆర్ఎస్ నేతల భూ కబ్జాలకు అంతు లేకుండా పోయింది. ప్రజా సమస్యలను గాలికొదిలేశారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి 2.4 లక్షల ఇండ్లకు నిధులిస్తే… కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టకుండా నిధులను దారి మళ్లించింది. ఇంటికో ఉద్యోగమిస్తానని… అప్పటిదాకా ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భ్రుతి ఇస్తానని మాట కేసీఆర్ ను నిలదీయండి. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వని కేసీఆర్ తన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలిచ్చుకున్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే 2.46 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి అపాయిట్ మెంట్ లెటర్లు ఇస్తే… ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయని దుర్మార్గుడు కేసీఆర్.

రుణమాఫీ ఇస్తానని హామీ ఇచ్చి రైతులను నట్టేట ముంచిన ఘనుడు కేసీఆర్. రుణమాఫీ అమలు చేయకపోవడంతో కొత్త అప్పులు పుట్టక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించి నష్టపోతున్నారు. రైతులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సబ్సిడీపై ఎరువులు అందజేస్తోంది. ఎకరాకు సగటున రూ.30 వేల మేరకు సబ్సిడీపై యూరియా అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదే. రాష్ట్రంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్న దుర్మార్గుడు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తున్నా… రాష్ట్రంలో రైతులకు వర్తింపజేయకుండా మోసం చేస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ప్రజా ప్రతినిధులు నిలదీస్తుంటే… బీఆర్ఎస్ లో చేరితేనే పంచాయతీలకు నిధులిస్తామంటూ బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులిస్తున్న పార్టీ బీజేపీ ప్రభుత్వం మాదే. రైతు వేదికలు, పల్లె ప్రక్రుతి వనాలు, స్మశాన వాటికలు, టాయిలెట్లు, వీధి దీపాలు సహా అన్ని కార్యక్రమాలకు నిధులిస్తోంది కేంద్రమే.

బీఆర్ఎస్ మాదిరిగానే నరేంద్రమోదీ సైతం బీజేపీలో చేరితేనే పంచాయతీలకు నిధులిస్తామని చెబితే…. బీఆర్ఎస్ లో ఒక్క సర్పంచ్, జడ్పీటీసీ సహా ఏ ఒక్క ప్రజా ప్రతినిధి మిగిలేవారు కాదు… నరేంద్రమోదీ ప్రభుత్వం కేసీఆర్ మాదిరిగా సంకుచిత రాజకీయాలు చేయబోరు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడతారు. ఆ తరువాత ప్రజల అభివ్రుద్దే ధ్యేయంగా పనిచేస్తారు. అందులో భాగంగానే పక్షపాతానికి తావులేకుండా దేశంలోని పంచాయతీలకు నరేంద్రమోదీ నిధులిస్తున్నారు. తెలంగాణకు సైతం పెద్ద ఎత్తున నిధులిస్తుంటే… కేసీఆర్ మాత్రం సహకరించకుండా రాజకీయాలు చేస్తున్నారు. మహేశ్వరం మండలంలో బంజారాలు ఎక్కువగా ఉన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని బీజేపీ ఘనంగా నిర్వహిస్తే… సీఎం కేసీఆర్ మాత్రం కనీసం సేవాలాల్ జయంతికి హాజరుకాలేదు. అంబేద్కర్, పూలె జయంతి, వర్థంతి కార్యక్రమాలకు హాజరుకాని మూర్ఖుడు కేసీఆర్. లిక్కర్ దందా పేరుతో దొంగ సారా దందా చేస్తున్న కేసీఆర్ బిడ్డ కవితను అరెస్ట్ చేస్తే తప్పేముంది? తప్పుడు పనులు చేస్తున్న బిడ్డకు బుద్ది చెప్పకుండా గగ్గోలు పెట్టడమేంది?

రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పడం సిగ్గు చేటు. సింగిల్ ఫేజ్ కరెంట్ ఇస్తూ త్రీ ఫేజ్ ఇస్తున్నట్లు పోజు కొడుతున్నరు. ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెబుతున్న కేసీఆర్ డిస్కంలకు కరెంట్ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? ప్రభుత్వ శాఖల బకాయిలే రూ.20 వేల కోట్లున్నా ఎందుకు చెల్లించడం లేదు? కేసీఆర్… నువ్వు 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు అమీర్ పేటకు వచ్చి చెప్పే దమ్ముందా? నీలో తెలంగాణ రక్తం ప్రవహిస్తే… నువ్వు మగోడివైతే ఊర్లలోకి వచ్చి ఆ మాట చెప్పే ధైర్యముందా?

ఎంఐఎం నేతలు బీఆర్ఎస్ నేతలతో కలిసి వక్ఫ్ భూములను కబ్జా చేస్తూ భూదందా చేస్తూ వందల కోట్లు సంపాదిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే హిందూ దేవుళ్లను కించపరుస్తున్నారు. ఎంఐఎం నేతలు నిజంగా ఇస్లాం మతం కోసం పనిచేస్తే… కాంగ్రెస్, బీఆర్ఎస్ కు అమ్ముడుపోకపోతే దమ్ముంటే మహేశ్వరం నియోజకవర్గంలో పోటీ చేయాలి. అట్లాగే రాష్ట్రంలోని 119 నియోజకవర్గంలో పోటీ చేయాలి. డిపాజిట్లు లేకుండా చేసి తీరుతాం. ఎంఐఎం నేతలవి బ్లాక్ మెయిల్ రాజకీయాలు. ఎన్నికలకు ముందు పోటీ చేస్తామంటూ బీరాలు పలికి… డబ్బులు దండుకున్నాక పాతబస్తీకే పరిమితమవుతారు. బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ములేక రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టులంతా కలిసి పోటీ చేసి ఓడగట్టాలని చూస్తున్నాయి.