అల్లం నారాయణ సతీమణి పద్మ మృతి

– సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంతాపం

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి పద్మ కన్నుమూశారు. అనారోగ్యం కారణాలతో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. పద్మ మరణంపై సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అల్లం నారాయణను సీఎం ఫోన్ లో పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో అల్లం పద్మ సేవలను గుర్తు చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పద్మ మృతికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఉద్యమంలో ఆమె పోషించిన పాత్రను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అల్లం నారాయణ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.