October 13, 2026

రేవంత్ ఫ్యామిలీ భూములను కూడా అదే జీఓ కింద విచారించండి

  • ఇదిగో రేవంత్, కాంగ్రెస్ నేతల భూముల వివరాలు
  • రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల భూములు కూడా 134 జీవో ఆధారంగా విచారించాలి
  • 134 జీవో రాజ్యాంగ వ్యతిరేకం. ఆర్టికల్ 14 కు విరుద్ధం
  • స్టీవెన్సన్ ప్రాణానికి ప్రమాదం
  • బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుల 2006 ఎకరాల భూములను జీవో 134 పరిధిలో చేర్చాలి. జీవో 134 ద్వారా ఏర్పడిన కమిటీ ఆర్టికల్ 14 కు విరుద్ధమైనది. చీఫ్ సెక్రటరీ పట్టించుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల భూములు కూడా 134 జీవో ఆధారంగా విచారించాలి. తెలంగాణలో ప్రజా పాలన కాదు,ప్రతీకార పాలన నడుస్తుంది. కుంభవృష్టి లాగా కుంభకోణాలు, అవినీతి.

నీటి వసతి ఉన్నా, నదులు ఉండే నీళ్లు పంప్ హౌస్ ల ద్వారా ఎత్తిపోయాలని చెప్తే పట్టించుకోకుండా ఎల్ నినో వస్తుందని చెప్పినా, చెవిన పెట్టకుండా, కేవలం సంపాదించడం పైనే దృష్టి. విద్యార్థులకు ఫీజుల రియంబర్స్ మెంట్ ఇవ్వకుండా 22 ఏ నిషేధిత జాబితాపై మాట్లాడుతుంటే, ప్రతీకారంతో వారి పేరు మీద ,వారి కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న భూములపై విచారణ పేరుతో సెప్టెంబర్ 24,2026 నాడు జీవో 134 తెచ్చారు.

శాసనసభలో జరిగిన ఏక పక్ష చర్చలో, 22ఏ నిషేధిత భూములకు సంబంధించిన జాబితా పై చర్చిస్తూ 13 జిల్లాల్లో విచారణ జరపాలని ఈ జీవో తెచ్చారు. దేవసేన చైర్మెన్ గా కమిటీ. కేవలం బిఆర్ఎస్ నేతల భూముల మీదనే ప్రధానంగా ఫోకస్. వీరి భూములు 22 ఏ కింద ఉన్నాయని పేర్కొంటూ 134 కింద అనుబంధంగా పెట్టారు.

కేసిఆర్, కే టి ఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి , గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర బిఆర్ఎస్ నాయకుల భూములను ఈ లిస్ట్ లో పెట్టారు. సంబంధం లేని వ్యక్తులను, అండ్ అసోసియేట్స్ అనే పేరుతో ఈ లిస్ట్ పెట్టారు. ఎల్విన్ స్టీఫెన్సన్ పేరు మీద సికింద్రాబాద్ లో ఉన్న భూములపై కూడా విచారణ.

2017 లో ఇతనికి 50 లక్షల లంచం ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడ్డాడు.ఆ ఘటనలో చంద్రబాబు నాయుడు వాయిస్ కూడా ఉంది. ఈ కేసును మళ్లీ మొదటి నుండి వినడానికి సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది.ఇప్పుడు స్టీవెన్సన్ ప్రాణానికి ప్రమాదం ఉంది. అతని నోరు మూయించడం కోసం ఆయన భూములను విచారించాలని చూస్తున్నారు. భూములన్నింటినీ ఖతం చేస్తానని భయపెట్టడానికి రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారు.

134 జీవో రాజ్యాంగ వ్యతిరేకం. ఆర్టికల్ 14 కు విరుద్ధం. ఈ జీవోలో కేవలం బి ఆర్ఎస్ నాయకుల భూములే విచారించాలని చూస్తున్నారని, కాంగ్రెస్ నాయకుల భూములను కూడా జీవో 134 పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తూ సంజయ్ జాజు ఛీఫ్ సెక్రటరీ కి లేఖ రాశాం. రేవంత్ రెడ్డి, గీతారెడ్డి,నైమిష రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి,బొడ్డు వినోద్ కుమార్, బీర్ల ఐలయ్య,, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి వంటి వారి పేరు మీద ఉన్న భూములను కూడా 134 జీవో ఆధారంగా ఏర్పడిన కమిటీ పరిశీలించాలి.

16/9/2026 నాడు జరిగిన చర్చ ఏకపక్షం. ముందస్తుగా చర్చించుకొని కుట్రపూరితంగా 7వ తేదీన బి ఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. రాష్ట్రంలోని సమస్యల గురించి మాట్లాడే అవకాశం లేకుండా చేశారు.కాంగ్రెస్ నాయకుల ఆస్తులు కూడా చేర్చాలి. జీవో లో ఉన్న అంశాల ప్రకారం కేవలం బిఆర్ఎస్ భూములను చేర్చాలని ఎక్కడా చెప్పలేదు. అయినా కేవలం ఆ జీవో ఆధారంగా ఏర్పడిన కమిటీకి బిఆర్ఎస్ నేతల భూముల వివరాలే ఇచ్చారు.

రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేట, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకుల భూముల వివరాలను కూడా జీవో 134 పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి శేరిలింగం పల్లి 127 సర్వే లో ఉన్న భూములు. సర్వే 646 కింద చౌటుప్పల్ మల్కాపురంలో అనుముల గీతారెడ్డి పేరు మీద ఉన్న 107 ఎకరాలు. నైమిష రెడ్డి ,సత్యనారాయణ రెడ్డిల పేరు మీద వెల్దండ లోని కొట్రలో ఉన్న 128 ఎకరాలు. తిరుపతి రెడ్డి కోస్గి మండలం నారాయణపేట లో ఉన్న భూములు. నైమిష రెడ్డి ఖుత్బుల్లాపూర్ సర్వే నెం 87 కింద
2 ఎకరాలు … 70,80 కోట్ల విలువైన భూమి కేవలం 7 కోట్లకు కొనుగోలు. కొండల్ రెడ్డి పేరు మీద వెల్దండ, వంగూరు లో ఉన్న భూములు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన 613 సర్వే 373 ఎకరాల నాదర్ గుల్ లో హర్షా రెడ్డికి సర్వే నెం 245,259 లో వట్టినాగుల పల్లి లో ఉన్న 27 ఎకరాలు. అల్వాల్ రెడ్డి వెల్దండ కొట్ర గ్రామంలో 48 ఎకరాలు. అన్నం రమేష్ రెడ్డి 58 ఎకరాలు కల్వకుర్తి ఎల్లికల్ గ్రామం. పుప్పాలగూడలో హర్షరెడ్డి పేరు మీద ఉన్న 14 ఎకరాలు. సాస్ ఇన్ ఫ్రా 3 ఎకరాల 17 గుంటలు ఖాజాగూడ లో అక్రమంగా రిజిస్ట్రేషన్. కరీజ్ ఖాతా భూమి ఖానామెట్ లో 26 ఎకరాలు ఆక్రమణ. బొడ్డు వినోద్ కుమార్ కొల్లూర్ 3 ఎకరాలు. 36 ఎకరాలు గచ్చిబౌలి లో మహేశ్వరంలో 400 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్తుమ్మలూరు లో 25 ఎకరాలు భువన్ ఇన్ ఫ్రా పేరు మీద ఉన్న భూములు. కీసర నాగారం లో 41 ఎకరాలు ఎస్సీల భూముల అక్రమ రిజిస్ట్రేషన్. బీర్ల ఐలయ్య 251 ఎకరాలు రాజాపేట,యాదగిరిగుట్ట లో ఉన్న భూములు. మల్లు రవి పేరు మీద శంషాబాద్ లో ఉన్న 86 ఎకరాలు. రాజ్యాంగం ఆర్టికల్ 14 ఆధారంగా అందరూ సమానమే. దీనికి విరుద్దంగా ఉండే ఏ చట్టం కూడా చెల్లదు.

సుప్రీం కోర్టు జడ్జితో కూడా విచారణ జరపవచ్చునని కేటి ఆర్ హరీష్ రావు చెప్పారు. 1968 కండక్ట్ రూల్స్ ప్రకారం పని చేయాలి.3(1)ఎ ప్రకారం ఫైల్ రన్ చేయాలి. 3(1) బి ప్రకారం వారి నుండి రిప్లై కూడా తీసుకోవాలి. రాజకీయ కక్షతో పని చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయని తెలియజేయాలి. సెక్షన్ 3(3) ప్రకారం ఖచ్చితంగా అభ్యంతరాలుంటే నోట్ ఫైల్ లో రాయాలని అడగాలి.

చామల కిరణ్ కుమార్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ బస్ వేసుకొని సిద్దిపేటకు వెళ్లారు. మీరు ఇబ్రహీం పట్నం లో మల్ రెడ్డి రంగారెడ్డి తో కలిసి ఏందందా చేస్తున్నారో? అబ్దుల్లాపూర్ మెట్ లో సుదర్శన్ రెడ్డి ఎమ్మార్వో గా మీకు తెలియకుండా పని చేశారా?
ముఖ్యమంత్రి బంధువు అని చెప్తారని, అర్ధరాత్రి వరకు ఉండి అక్రమ పనులు ఎకరాకు 10 నుండి 15 లక్షల మామూళ్లు చేశారని వార్తలు ఉన్నాయి. ఈ ఎమ్మార్వో అధికారంలో ఉన్న రెండేళ్లలో ఎవరెవరికి మామూళ్లు అందాయో విచారణ జరపాలి. భీం రెడ్డి వలే, ఇతన్ని కూడా కస్టడీకి తీసుకొని విచారించాలి. మేరుగు గోపాల్ యాదవ్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీ ఢిల్లీలో పెట్టారు. కానీ ఈయన ఎస్సీ ఎస్టీ లకు సంబంధించిన సుమారు 200 పైగా ఎకరాల భూమి అక్రమంగా తన పేరు మీదికి మార్చుకున్నారు. ఇది ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం ఇది విరుద్దం.

డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజెందర్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని చింత చెరువు ఫీడర్ ఛానల్ లోని ఎఫ్.టి.ఎల్ పరిధిలో సుమారు 200 ఎకరాల్లో ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన, సంఘి విల్లాల నిర్మాణం ఆపాలని లేఖలు రాస్తే పట్టించుకోలేదు. శ్రీవాణి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో కి లేఖ రాసి గూడెం కుంట,ఇంజాపూర్ గ్రామంలో ప్రహరీ గోడ నిర్మాణాన్ని ఆపాలని కోరినా పట్టించుకోలేదు.

ఆంజనేయులు అనే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వోకు 155,156,1601,163 లో అనుమతి లేకుండా, సంఘి విల్లాల పేరుతో నిర్మాణం చేస్తున్నారని లేఖ రాస్తే.. అధికారులు పట్టించుకోలేదు. ఇవన్నీ హైడ్రా కమీషనర్ రంగనాథ్ ఎందుకు పట్టించుకోలేదు. కానీ పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వస్తే వారి ఇల్లు కూల్చారు. ఇది కేవలం మొదటి విడత మాత్రమే. రెండవ విడతలో మరిన్ని వివరాలు ఇస్తాం

25 మంది వ్యక్తుల భూముల వివరాలు. ప్రజలే మాకు ఈ సమాచారం ఇచ్చారు. మేము వారి లాగా బుల్లెట్ ప్రూఫ్ బస్సులు వేసుకొని వెళ్లం. చీఫ్ సెక్రటరీ పట్టించుకోకపోతే 226 ప్రకారం హై కోర్టు ను ఆశ్రయిస్తాం. తెలంగాణలో ఫేక్ ఎఫ్ఐఆర్ లు సృష్టించి, బతికున్న వారిని చనిపోయినట్టుగా చూపి కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకు పాల్పడుతోంది. త్వరలో ఆధారాలతో వివరాలతో బయటపెడతాం.

Total Visitors: 2,950,809