Suryaa.co.in

Political News

అమలాపురం ఘటన దేనికి నిదర్శనం?

– కాపులమీద నింద మోపే కుట్ర

జగన్మోహన్ రెడ్డి 26 జిల్లాలుగా ప్రకటన చేసి ఆయనకి ఇష్టంగా, రాజకీయంగా అవసరం అనుకున్న , పేర్లను జిల్లాలకు పెట్టారు . కొన్ని జిల్లాలకు పేర్ల మీద వ్యతిరేకత ఉన్నా వాటిని సైతం లెక్కచేయకుండా పేర్లు పెట్టారు. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కొంత భాగాన్ని అమలాపురం ప్రాంతాన్ని కోనసీమ జిల్లాగా ప్రకటించారు. సంతోషం.

జిల్లాగా ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్సిపి కి సంబంధించిన మంత్రులు ,ఎమ్మెల్యేలు, స్థానిక యువకులు తో కలిపి కేకులు కట్ చేసుకున్నారు. కానీ దీని వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉందనేది ఇప్పుడు అర్థం అవుతోంది .

ఎలాగంటే అన్ని జిల్లాల పేర్లు ప్రకటించినప్పుడు.. మీకు నిజంగా అమలాపురం ప్రాంతానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని ఉద్దేశం ఉంటే, మొదట్లోనే మీరు పేరు నిర్ణయం చేసి చేసి ప్రకటించి ఉంటే అందుకు ఎవరు అడ్డు చెప్పేవారు కాదు . ఇంత గొడవలకు అవకాశం ఉండేది కాదు. మీ స్వార్థం కోసం ఒక మహనీయుని మీరు అనవసరంగా వీధుల్లోకి లాగారు.

కానీ మీకు దురుద్దేశం ఉంది కాబట్టి, జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీరు రాష్ట్రంలో ఉండే దళిత వర్గాన్ని దగ్గర చేర్చుకోవడం కోసం, ఇంతకన్నా వేరే అవకాశం మనకు రాదని చెప్పి.. కోనసీమ అంబేద్కర్ జిల్లాగా నామకరణ చేస్తామని, అందుకు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల లోపల తెలియజేయమని మీరు ప్రకటన చేశారు. కానీ మీరు జివో రిలీజ్ చేయగానే.. మీ మంత్రులు,ఎమ్మెల్యేలు , సకల శాఖల మంత్రితో సహ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించి వేశామని మాట్లాడుతూనే ఉన్నారు.

అంటే మీ ఉద్దేశం గతంలో 2016 లో కాపు ఉద్యమం ఆ ప్రాంతం నుంచి జరిగింది .దీనిని కూడా ఏదో ఒక ఆందోళన మొదలు పెట్టి గందరగోళం సృష్టించి ఆరోజున కాపుల మీద ఏ విధంగా గా నింద వేశారో, అదేవిధంగా నిన్న కూడా నింద వేయుటకు ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది .

మంత్రి ఇల్లు, ఎమ్మెల్యే ఇల్లు బస్సులు తగలబడి పోతుంటే, అమలాపురం టౌన్ లో ఉన్నటువంటి, చుట్టుప్రక్కల ఉన్నటువంటి అగ్నిమాపక కేంద్రాలు పని చేయవా ? ఆ లారీలు రావా ? గంటలు గంటలు వాటికోసం నిరీక్షణ చేయాలా !

వేలమంది ప్రజలు రోడ్ల మీద గుమికూడుతుంటే వారం రోజుల నుండి జిల్లా పేరు విషయంలో ఊరేగింపులు మీటింగులు జరుగుతూ ఉంటే, పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తున్నదా లేదా ? ఊరేగింపులు పెద్ద ఉద్యమాలు అవుతాయేమో అని పోలీసులు అలర్ట్ గా ఉండరా?

ఈ రోజున కూడా అదే ప్రాంతం కాబట్టి .. ఆ ప్రాంతంలో కాపులు ఎక్కువ కాబట్టి ఆ నిందను కూడా మీరు కాపుల మీద వేయడానికి, జనసేన, బీజేపీ, టిడిపి మీద వేయడానికి ఎత్తుగడ వేశారు. సంఘటన జరిగిన వెంటనే పోలీస్ విచారణ చేయకుండా విధంగా జరిగిందో ఏమీ బయటకు రాకముందే.. మీ తెలివి కలిగిన హోం మినిస్టర్ గారు దీనిని జనసేన , తెలుగుదేశం పార్టీ కలిసి చేశారని ఏవిధంగా ప్రకటిస్తారు? అంత బాధ్యతారహితంగా ప్రవర్తించే మంత్రిని మీరు ఈ రాష్ట్రానికి హోమ్ మంత్రి ని చేసి రాష్ట్రం పరువు తీస్తున్నారు .

ఈ మంత్రి గారు ఆడపిల్లను మానభంగం చేసి హత్య చేస్తే, తప్పు ఎవరు మీద వేశారో ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు .ఒక దళిత స్త్రీ గా ఉండి హత్య భావించబడిన స్త్రీ దళితురాలయుండి, నేరం చేసినవారు తాగిన మైకంలో చేశారు మనము తల్లిదండ్రులం బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె స్టేట్మెంట్ కి నీరాజనాలు పలకాలి .

అయితే ఈ ఎత్తుగడను, పోయిన సారి ఎన్నికల్లో మీరు అధికారంలోకి రావటానికి ఎంతో కష్టపడి పని చేసిన మహాసేన నాయకుడు రాజేష్.. మీ ఎత్తుగడను ముందుగా పసిగట్టి ఈ ఉపద్రవాన్ని జనసేన మీద వేస్తారని, అతను ముందుగానే సోషల్ మీడియా ద్వారా చెప్పారు .ఈ ఎత్తుగడ సోషల్ మీడియా బయట పెట్టింది . సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీ బులుగు మీడియా కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ముందుగానే బయటకు వచ్చింది .

కోనసీమ కావాలని ఆందోళన చేస్తున్న రామకృష్ణ అనే నాయకుడు ఏ కులానికి చెందిన వాడు? శెట్టిబలిజ బీసీ. సాయి అనే యువకుడు పవన్ కళ్యాణ్ తో ఫోటోలు మీరు బయటపెట్టి సాయి నాయుడు గా పేరు మార్చి, కాపులమీద నింద మోపుటకు ప్రయత్నం చేస్తున్నారు. దీనిని జనసేన సోషల్ మీడియా మీ కంటే ముందుగానే ఈ సాయి ఫోటో మీ ఎమ్మెల్యేలతో, మీ సకల శాఖ మంత్రితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా బయట పెట్ట బట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేశారు.మీ కుట్ర బయటకు వచ్చింది మీ దొంగతనం, డొల్లతనం బట్ట బయలయింది .

ఇకపోతే నిన్న కాక మొన్న మీ ఎమ్మెల్సీ అనంత బాబు చేసిన హత్య . డ్రైవర్ దళితుడు . మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితుల మీద దాడులు, దళిత స్త్రీలు మానభంగాలు, హత్యలు, డాక్టర్ సుధాకర్, తూ గొ జిల్లా లో దొంగ ఇసుక తరలిస్తుంటే ఆపిన యువకుడు హత్య, చీరాలలో మాస్కు లేదని కొట్టిన జరిగిన హత్య, కాకినాడ లో జరిగిన డ్రైవర్ హత్య, ఇలాంటివన్నీ దళిత కులానికి సంబంధించిన వారే ఇలాంటివి ఎన్నో.

మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ కులాల, తెగల నిధులన్నిటిని దారి మళ్లించి, వారికి లోన్లు రాకుండా ద్రోహం చేసిన ఘనత మీదే. రాబోయే ఎన్నికల్లో మీకు దళితులు వ్యతిరేకంగా పని చేస్తారని (మీకు ముందుగా ఇంటలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని వారికి మీరేదో అనుకూలంగా చేస్తున్నట్టుగా అన్ని జిల్లాల పేర్లు ప్రకటించినప్పుడు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ గా నామకరణం చేయకుండా ఇప్పుడు చేస్తున్నారంటే దాని అర్థం అదే) ఒక వాతావరణాన్ని సృష్టించి దాని కోసం వేసిన ఎత్తుగడ తప్ప ఇంకొకటి కాదు.

మీకు కాపుల ఓట్లు ఎటూ రావని తెలుసుకుని వారిని సపరేట్ చేస్తూ , వారిని దళితులకు దోషులుగా చిత్రీకరించే దానికోసం చేద్దామనుకున్నారు. కానీ వికటించింది. ప్రకృతి ఒప్పుకోలేదు. రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేస్తారు. చేయగలరు అనేది ఇంకొక సారి రుజువు చేసుకున్నారు.
స్థానిక అమలాపురం ప్రజలు కులాలతో సంబంధం లేకుండా జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనించి ,గ్రహించి మీ ప్రాంతానికి ఉన్న మంచి పేరును మీరు నిలబెట్టుకొని, ఇంకొకసారి ఇటువంటి ఘటనలు జరుగకుండా కాపాడవలసిన బాధ్యత మీదే .

– కరణం భాస్కర్ ,
బిజెపి ,
మొబైల్ నెంబర్ 7386128877 .

LEAVE A RESPONSE