అమరావతి..మానుతున్న గాయం

ఏవి తల్లీ మునుపు కురిసిన హిమ సుమాలు అంటాడు ఒక కవి గారు!
అలాగే ఉన్నది రాజధాని ప్రాంతం?
నిత్యం నిర్మాణ కార్మికులతో కళకళ లాడుతూ..ఉండేది..!
ఎటు చూసినా అద్భుతాలు ఆవిష్కారం అవుతాయి అనిపించేది.
ఒక గొప్ప నగరం నిర్మించబడుతున్నదన్న భావన ఉత్తేజాన్ని కలిగించేది.
భూములు చేజారిన రైతు బాంధవుల గుండెలు బరువెక్కినా తల ఎత్తుకునే పని చేసామన్న తృప్తి ఉండేది.
శరవేగంగా నిర్మాణాలు జరుగుతుంటే..కళ్ళలో మెరుపు కనిపించేది.
గ్రామాలు జనాలతో సందడిగా ఉండేవి.
కాలరక్కసి..ఒక కుదుపు కుదిపింది..!
దుష్టుడి చేతిలో పడి నలుగుతుంది..అమరావతి..!
అమరావతి ని వివస్త్ర చేసి అవమానం చేస్తున్నారు..!
రోడ్లు తవ్వి గాయపరుస్తున్నారు.
నిర్మాణ సామాగ్రి ఎత్తుకెళ్ళారు..!

ఎడారి అంటూ ఎడారిలా మార్చటానికి చూసారు.
ముంపు ప్రాంతమంటూ ముంచటానికి చూసారు.
శ్మశానమంటూ భూములిచ్చిన వారి ని మనోవేదనకు గురి చేసారు.
అసంపూర్ణ భవంతుల మీద పిచ్చి మొక్కలు మొలిపించారు.
నిరసన యాగం ఎగసిపడింది.
కాలం కరిగింది..గాయం చేసింది.
కాలం మారుతుంది చేసిన గాయం మాన్పుతుందన్న విశ్వాసం ఇప్పుడిప్పుడే పెరుగుతుంది.

రైతు మహిళా నిరసన కారులు ఇదేస్ఫూర్తితో అంతిమ విజయం సాధించాలి.
అలకలు అనుమానాలు వద్దు..!
కరిగిన కాలాన్ని భవిష్యత్తులో సరి చెయ్యాలి.
ఎంతో బరువు బాధ్యత ఉన్నాయి.
ధర్మం న్యాయం రక్షగా ఉన్నాయి.
జై అమరావతి!

– తిప్పిశెట్టి వెంకటేశ్వర్లు

Leave a Reply