ఇండియాలో కులాలు పోగొట్టలేకపోవచ్చు.
కానీ కుల వివక్షలు పోగొట్టుకోవచ్చు.
మతాలు పోగొట్టలేకపోవచ్చు
కానీ మత వివక్షలు పోగొట్టుకోవచ్చు..
రంగులు పోగొట్టుకోలేకపోవచ్చు
కానీ రంగులపట్ల ఉన్న వివక్షలను పోగొట్టుకోవచ్చు.
ఇక స్ర్తీల పట్ల ఉన్న చిన్నచూపును,హేళనను,వివక్షను పోగొట్టుకోవచ్చు .
ఇవన్నీ పోగొట్టుకున్నాక కదా పేదలంతా ఏకమై పేదవాడికి ధనికుడికి మధ్య ఉన్న అంతరాలను తగ్గించేందుకు అందరికీ సమాన హక్కులు కల్పించేందుకు, దోపిడీని నిరోధించేందుకు ప్రభుత్వం మీద పోరాడతారు.
అప్పుడు కదా బ్యాలెట్ తో యుధ్ధమా..బుల్లెట్ తో యుధ్ధమా అంటూ పోరాటాల గురించి ఆలోచించేది..!!
ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆటవిక జాతుల వారని..వారంటే దేశం మొత్తం చిన్నచూపు చూస్తారు..ఇక అక్కడి మహిళల మీద జరిగే రేపులు, హత్యలకైతే లెక్కే లేదు.
ఇక ఒరిస్సా,బీహార్,రాజస్థాన్ ప్రజలంటే తెలివి తక్కువ వారనీ, మూర్ఖులనీ, రౌడీలనీ దేశం మొత్తం వారిని మరింత చిన్నచూపు చూస్తారు.
ఇక కాశ్మీర్ తో పాటు దేశంలో ఉన్న ముస్లింలంటే చాలా వివక్ష ఉంది. అది మర్కజ్ తో డబుల్ అయ్యింది.
ఇక దళితుల పట్ల దేశమంతా దారుణమైన చిన్నచూపే ఉంది.గుర్రం ఎక్కినందుకు, పెళ్ళిలో డాన్స్ చేసినందుకు, పండ్లు తెంపినందుకు,కొత్త బట్టలు వేసుకున్నందుకు కూడా దారుణంగా రేపులు చేసి హత్యలు చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి.
హిందీ కాకుండా తెలుగు లాంటి ప్రాంతీయ బాషలు మాట్లాడే వారి పట్ల దేశం మొత్తంలో వివక్ష ఉంది.. ఇక పురాతన ఆటవిక బాషలు మాట్లాడేవారి పట్ల ఇంకెంత చిన్న చూపుందో మనం గమనించవచ్చు
ఇక BC లలో BC A వారంటే BC B ,BC D లకు చిన్న చూపు ఉంది
వైశ్యులలో,బ్రాహ్మణులలో నల్లగున్న వారి పట్ల ఎర్రగున్నవారు, తెల్లగున్న వారు చూపే వివక్ష దారుణంగా ఉంటుంది..
దక్షిణ భారతీయులంటే ఉత్తర భారతీయులకు మనుషుల్లాగా కూడా కనపడనంత వివక్ష ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాలు,కర్నాటక,ఒరిస్సా,బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ బ్రాహ్మణులైతే… తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్,వెస్ట్ బెంగాల్,కాశ్మీర్ బ్రాహ్మణులకు జంతువులకంటే హీనంగా కనపడతారు..
క్రిస్టియన్ అయిన దళితుల పట్ల దళితులే వివక్ష ప్రదర్శిస్తున్నారు.. ఇక క్రిష్టియన్ అయితే చాలు. ఏ కులం వారినైనా దారుణంగానే అవమానిస్తున్నారు..
ఏ కులం వారైనా సరే ఆడవారైతే చాలు రేపులు చేసి చంపేద్దామనే పరిస్థితులే ఉన్నాయి..
ఇన్ని వివక్షలు దేశం నిండా పెట్టుకుని పేద వారికి,ధనికుడికి మధ్య ఉన్న అంతరాలను తగ్గించేందుకు అంబేద్కర్ చాలడూ, బుధ్ధుడూ చాలడూ అంటూ విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్?
అసలు ఇన్ని రకాలుగా వేరుపడి ఉన్న ప్రజలంతా కేవలం పేదరికం ఉందన్న ఒకే ఒక కారణంతో ఏకమవ్వగలరా అసలు..!!
మేము కూటికి పేదోళ్ళం కాని కులానికి కాదని..తమ పేదరికాన్ని కూడా ఆనందంతో స్వీకరిస్తూ.. కులాన్ని, కుల దురహంకారాన్ని వదులుకోలేని సమాజానికి అంబేద్కరే కావాలి..
అంబేద్కరిజం ఈజ్ అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ఇండియా.!!
ఆయన ఆశయాలను ముందు ఇంప్లిమెంట్ చేసాక పేదరిక నిర్మూళన గురించి ఆలోచించడం మంచిది..!!.మన దేశంలో ఇప్పటివరకు కొన్ని లక్షల కోట్ల బబ్జెట్ ను కేవలం పేదల సంక్షేమం కోసమే ఖర్చుపెట్టారు. కాని పేదరికం రోజు రోజుకూ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు.
దానికి కారణం ప్రజలంతా కులాల పేరుతో,జాతుల పేరుతో, మతాల పేరుతో వేరుపడి ఉండడమే..వీరందరూ పేదలుగా ఒక్కటవ్వాలంటే అంబేద్కర్ ఆశయ సాధనతోనే సాధ్యం.
-శివకుమార్ పోగుల