Suryaa.co.in

Telangana

శివ మాల వేసిన విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడి అనుచిత ప్రవర్తన

హిందువులు పవిత్రంగా భావించే మాలాధారణ పట్ల కొందరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. శివ మాల వేసిన విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడి అనుచిత ప్రవర్తన పై, శివమాల ధరించిన భక్తులతో పాటు అయ్యప్ప మాల ధారణ స్వాములు పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేశారు ఉపాధ్యాయుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలోశివ మాల వేసుకున్న విద్యార్థి పట్ల పాఠశాల పిఈటి అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు అవమానించారని శివ స్వాములు అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని, పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేశారు. సదరు ఉపాధ్యాయుడిపై శివ స్వాములు అయ్యప్ప స్వాములు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మరిపెడ ఎస్సై ఝాన్సీ ఆధ్వర్యంలో పిఈటి ని స్టేషన్ కు తరలించి విచారణ జరుపుతున్నారు.

LEAVE A RESPONSE