-క్రూర వ్యూహకర్తలను సిద్ధం చేస్తున్న అమెరికా
-ఇండియాలోకి డాలర్ల వరద?
-మీడియా, సోషల్‌మీడియా ద్వారా వ్యూహం అమలు
-వ్యూహకర్త విక్టోరియా న్యూలాండ్
భారతదేశంలో 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు అమెరికా ఇప్పటినుండే తన సన్నాహాలను మొదలు పెట్టేసింది. అందుకనుగుణంగా CIA, భారత్‌లోని తన స్లీపర్‌సెల్స్‌ని (తాను నియమించిన తనకు మాత్రమే విధేయులైన కీలకమైన వ్యక్తులు, వ్యూహాత్మక సంస్థలు) తన వ్యూహానికి అనుగుణంగా నిర్దేశించిన కార్యక్రమాల అమలుకు సంసిద్ధం చేస్తోంది. 2024 ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే కృషిలో భాగంగా ఈ వ్యక్తులు, సంస్థలు చేసే వ్యాఖ్యలను, దుష్ప్రచారాన్ని వైరల్ చేయడానికి మాఫియామీడియా తీవ్రంగా కృషి చేయబోతోంది. అలాగే లెక్కలేనన్ని డాలర్లు దేశంలోకి వరదలా ప్రవహించనున్నాయ్.
ఉక్రెయిన్‌లో ఉన్న ఖనిజ సంపదను నియంత్రించే దాని ఎజెండాను బలోపేతం చేయడానికి.. ఒక తోలుబొమ్మ వంటి వ్యక్తిని అధికారంలో ఉంచడానికి, కొనసాగించడానికి ఉక్రేనియన్ ఎన్నికలలో US జోక్యం చేసుకుందన్న విషయం మనం మరవకూడదు. అలాగే భారతదేశంలో కూడా నైతికంగా, రాజకీయంగా బలహీనమైన నాయకత్వాన్ని పశ్చిమ దేశాలు.. ముఖ్యంగా అమెరికా.. ఎల్లప్పుడూ ఇష్టపడతాయి. పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలతో కూడిన ప్రాంతీయ పార్టీలు చేతులు కలపడం వల్ల.. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఏర్పడుతుంది.. దేశం బలహీనపడుతుంది. ఇదే అమెరికాకు కావలసింది. నెహ్రూ వంటి నైతిక అవినీతిపరుడు విదేశీ శక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు జాతీయ ప్రయోజనాల విషయంలో ఎలా రాజీ పడ్డాడో.. తాకట్టు పెట్టాడో మనకు తెలుసు.
అలాంటి నెహ్రూకు, అమెరికా ఆశలకు, ఆశయాలకు భిన్నంగా.. మోడీ నైతికంగా లేదా రాజకీయంగా బలహీనమైన లేదా రాజీపడే వ్యక్తి కాదు. దానికి తోడు సొంతంగా బీజేపీకి ఉన్న 302 సీట్ల బలంతో కేంద్రప్రభుత్వం బలంగా ఉంది. అలాంటి పరిస్థితిలోనే.. ప్రభుత్వ విధానాల్లో, వ్యవహార శైలిలో ఉనికి ఎంతమాత్రం లేని ఫాసిజానికి, మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు నటిస్తూ చేసే తన ప్రచారానికి ఇటువంటి స్లీపర్‌సెల్స్ /ఏజెంట్లు అవసరమౌతారు. ఈ CIA ఏజెంట్లు సెక్యులర్ లిబరల్ మీడియాలో ప్రవహించే డబ్బుతో ఉక్రెయిన్ ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాన్ని భారత్‌లోనూ అమలు చేయడానికి ప్రయత్నిస్తారు.. అదే.. ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేయడం.
ఈ క్రూర కార్య అమలుకు అమెరికా ఎంచుకొన్న.. తన ప్రభుత్వంలోని రాజకీయ వ్యవహారాల మంత్రిత్వ విభాగంలోని అండర్ సెక్రెటరీ “విక్టోరియా న్యూలాండ్” కున్న ప్రధానమైన నైపుణ్యమే.. “అమెరికాకెదురు తిరిగే దేశాల్లో.. పాలకుల మార్పు మరియు అమెరికన్ ప్రయోజనాలకు ఉపయోగపడే తోలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.” 75 ఏళ్ళ తర్వాత మొదటిసారి.. గర్జిస్తోన్న భారత్.. అమెరికన్ ప్రభుత్వ వ్యూహకర్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఎందుకంటే ఈ భారత్ అమెరికా ప్రయోజనాలకు గాక తన స్వప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోంది. ఇది అమెరికా కలలో కూడా ఊహించనిది. ఈ పరిస్థితిని వీలైనంత త్వరగా తారుమారు చేయకపోతే.. ప్రస్తుతం భారత్‌లోని ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే.. ఇప్పటివరకూ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని.. ఏకచ్ఛత్రాధిపత్యంగా శాసిస్తోన్న అమెరికా చాప క్రిందకే నీళ్ళొచ్చే ప్రమాదాన్ని అది పసిగట్టింది.
సనాతన సంస్కృతికి.. దైవాలకు.. ఆలయాలకు వ్యతిరేకంగా ఆమాద్మీ గుజరాత్ అధ్యక్షుడు మరియు ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే/కేబినెట్ మంత్రి ఇటీవల చేసిన దూషణలు న్యూలాండ్ టూల్ కిట్‌లో భాగమే. ఇక్కడొకసారి రామాయణాన్ని తలచుకొంటే.. అందులో రావణుడు ధనవంతుడు, శక్తివంతుడు మరియు దైవాశీస్సులు మెండుగా గలవాడు. ఐనప్పటికీ శ్రీరాముడు గెలుపొందాడు. ఎందుకంటే రావణుడి వద్ద లేని నైతిక బలం శ్రీరాముని వద్ద ఉంది.
నేటి ప్రపంచంలో, మోడీకి వ్యక్తిగతంగా నైతిక బలం ఉంది.. అందుకే ప్రపంచ నికృష్ఠ దుష్టగుంపులన్నీ ఒక్కతాటిపైకొచ్చి తమ శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ.. మోదీ ఎన్నికల విజయాలను ప్రభావితం చేయలేకపోతున్నారు. గుర్తుంచుకోండి.. 2024 సార్వత్రిక ఎన్నికల బాట సంక్లిష్టమైనది.. భయంకరమైన ఒడిదుడుకులతో కూడినది. భారత్‌ను, సనాతనాన్ని కాపాడేందుకు మోదీకి గట్టి మద్దతు అవసరం. ఇలాంటి సమయంలోనే.. మనమంతా ఎంతమాత్రం సంయమనం కోల్పోకుండా.. ఎలాంటి సంకోచానికీ తావులేకుండా.. మోదీకి మద్దతుగా నిలబడడం మన ధర్మం.. మన బాధ్యత..!
– కెవి రమణారెడ్డి