Suryaa.co.in

Entertainment

అంజాద్ మరణించినా గబ్బర్ చిరంజీవి..

కిత్నే ఇనామ్ రఖా హై
సర్కార్ హమ్ పర్..

జబ్ బచ్చా రోయేగాతో
ఇస్కా మా బోలేగా
సోజా బేటా..
నైతో గబ్బర్ ఆజాయేగా..
ఇన్ సబ్కో మిట్టీ మే మిలాదియా..

అబ్ తేరే క్యాహోగా కాలియా
సర్దార్..మై ఆప్కా
నమక్ హూ..
అబ్ ఇస్ బందూక్ కా..

విలనీలో ఇంత రాక్షసమా..
దుర్మార్గంలోనూ
అంత రాజసమా..
ఓయి..గబ్బరూ నీకిది
సమంజసమా..?
ఆరుగుళ్ళ తుపాకీలో
మూడు నింపి..
గరగరా తిప్పి..
పొగాకు నములుతూ
ప్రాణాలతో చెలగాటమా..
యేభీ బచ్గయా.
తీనోభీ బచ్గయా..
ఆశ నింపి అంతలో
శ్వాస ఆపేస్తావా..
హోలీ కబ్ హై..
నీ అసాధ్యం కూలిపోనూ..
విలనీలో ఐరనీ..
అమితాబ్..ధర్మేంద్ర..
సంజీవ్ కుమార్..
హేమామాలిని.. జయబాధురి..
ఇందరున్న షోలే..
నీ దుర్మార్గంతోనే
భలే భలే…!

గబ్బర్ సింగ్..
ఫుల్ స్వింగ్..
నువ్వొస్తే రామఘడ్ కు దడ..
ప్రేక్షకులకు సందడే సందడి..
జనం విలన్ని ప్రేమించేలా
చెయ్యడం నీకే చెల్లు..
అది దుర్మార్గంపై
నువ్వు రాసిన విల్లు..!

షోలే..నీ వల్ల
రికార్డులే రికార్డులు..
నీ డైలాగుల రికార్డులు..
నీకెన్నో అవార్డులు..
చంబల్ బందిపోటుగా
నీ అభినయం
ఓ పాఠం..
ఆ దెబ్బతో అభిమానుల గుండెల్లో నీ బొమ్మ హఠం!

ఇప్పటికీ చేతులు
మడిచిన నీ చొక్కా..
మ్యాచింగ్ ప్యాంటు..
కరకరమనే బూట్లు..
చేతిలో బందూకు..
మాసిన గడ్డం..
మొహంలో క్రౌర్యం..
అదంతా ఓ ఘనకార్యం..!
ఆ తర్వాత
ఎన్ని సినిమాల్లో
ఏం చేసినా..
ముకద్దర్ కా సికందర్లో
దిలావర్ గా మెప్పించినా..
ఖుర్నానీలో నీటిలో మునిగి
పోలీసు పాత్రను ఒప్పించినా
సింహాసనంలో బుక్కడిగా
నవ్వించినా..
నువ్వు గబ్బరే..
మా జ్ఞాపకాల్లో ఎప్పటికీ
గబ్బర్ హిప్ హిప్ హుర్రే!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE