Suryaa.co.in

Andhra Pradesh

సీఆర్డీఏ చట్ట సవరణతో అమరావతి నిర్వీర్యం: రైతుల ఆవేదన

అమరావతి : జగన్ ప్రభుత్వం.. సీఆర్డీఏ సవరణతో అమరావతిని నిర్వీర్యం చేస్తోందని అమరావతి రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.సీఆర్డీఏ రైతులతో చేసుకున్న ఒప్పందాలు తుంగలో తొక్కుతోందని విమర్శించారు.

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల అభిప్రాయాన్ని సీఆర్డీఏ అధికారులు.. పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమని రైతులు విచారం వ్యక్తం చేశారు. సీఆర్డీఏ సవరణపై తమ అభ్యంతరాలు, సూచనలతో అమరావతి రైతులు సీఆర్డీఏ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు.

సీఆర్డీఏ సవరణతో..జగన్ ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. రైతులతో.. సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందాలు తుంగలో తొక్కుతోందని విమర్శించారు. 29 గ్రామాల్లో ఇతరులకు సెంటు భూమి ఇవ్వడం భావ్యం కాదని అన్నారు.

గ్రామ సభలు నిర్వహించి.. రైతుల ఆమోదం తర్వాతనే పేదలకు సెంటు భూమి కేటాయించాలన్నారు. గ్రామసభలు నిర్వహించకుండా అధికారులు ఏకపక్షంగా సెంటు భూమిని పేదలకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారన్న రైతులు.. ఇది సీఆర్డీఏ చట్టానికి విరుద్ధమని ఆక్షేపించారు. దీనిపై రైతులు వ్యక్తిగతంగా సీఆర్డీఏ అధికారులకు వినతిపత్రం సమర్పించామని తెలిపారు.

ఇప్పటికే 20వేల పత్రాలు సమర్పించామన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల అభిప్రాయం సీఆర్డీఏ అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమని రైతులు విచారం వ్యక్తం చేశారు.

ధాన్యం డబ్బులు ఇవ్వకపోగా.. దాడులు చేస్తున్నారు
కొన్న ధాన్యానికి డబ్బులివ్వకుండా బెదిరిస్తున్నాడంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును గుంటూరు కలక్టరేట్‌ స్పందన కార్యక్రమంలో వెలిబుచ్చారు కాకుమాను మండలం రేటూరు గ్రామ రైతులు. ధాన్యానికి డబ్బులు చెల్లించకుండా.. కొనుగోలు చేసిన వ్యక్తి బెదిరిస్తున్నాడంటూ గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరు గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు గుంటూరు కలక్టరేట్‌లో ఏర్పాటు చేసిన స్పందన లో పాల్గొని అధికారులకు వారి గోడును చెప్పుకున్నారు.2018లో చేబ్రోలుకు చెందిన రామారావు అనే వ్యక్తి ధాన్యం కొనుగోలు చేసి.. ఇంకా డబ్బులు ఇవ్వలేదని రైతులు ఫిర్యాదు చేశారు. నగదు అడిగినందుకు తమపై భౌతిక దాడులకు దిగుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు.పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం వ్యాపారి నుంచి తమకు ప్రాణహాని ఉందని వాపోతున్నారు. అధికారులు స్పందించి.. ధాన్యం డబ్బులు ఇప్పించి.. తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.

LEAVE A RESPONSE