Suryaa.co.in

Telangana

అప్పుల్లో ఉందని కాంగ్రెస్ సానుభూతి పొందే ప్రయత్నం

-మీకు కేసిఆర్ కి పెద్ద తేడా ఏమీ లేదు
-కేసిఆర్ తొవ్వలోనే నడుస్తున్నారు
-గావ్ చలో.. బస్తీ చలో
-బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో జేపీ నడ్డా గారి సూచనలను ప్రజల్లోకి తీసుకెళ్తాము. గెలుపే లక్ష్యంగా ఈ సమావేశాలు జరిగాయి. మరోసారి నరేంద్ర మోడీ నే ప్రధానిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రతీ కార్యకర్త జోష్ తో పని చేయడానికి గ్రామీణ స్థాయిలో ముందుకు వెళ్తున్నారు.

గావ్ చలో.. బస్తీ చలో పేరుతో, పట్టణ, పల్లెలలో ప్రజలను కలిసి మోడీ ప్రభుత్వ పథకాలను తెలియజేస్తున్నాము. ఫిబ్రవరి 5 నుండి 8 వరకు ప్రతీ కార్యకర్త ప్రతి గ్రామంలో 24 గంటలు ఉండి ప్రజలతో మమేకం అవుతారు.కొత్తగా ఓటర్లుగా నమోదైన వారితో నూతన ఓటర్ల సంపర్క్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తాం.

ప్రజలకు బాల రాముని దర్శనం చేయించడానికి ప్రణాళికలు రూపొందించాం. మహిళా సాధికారిత కోసం మహిళా సంఘాలకు ముద్ర వంటి లోన్స్ తో వారికి చేయూత ఇచ్చాం. 2029 లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఆమోదించడం పై సహకరించే కార్యక్రమాలు ఇప్పటినుండే రూపొందిస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాలయాలు ప్రారంభం.

కేసీఆర్ అవినీతి పాలన, కుంభకోణాలు, ప్రజల ఆస్తుల లూటి చేయడం వల్ల కేసిఆర్ నీ ప్రజలు ఓడించారు. కేసీఆర్ మీద వ్యతిరేకతతో ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అతిస్వల్ప మెజారిటీ తో గెలిపించారు. రాష్ట్రం అప్పుల్లో ఉంది అని కాంగ్రెస్ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుంది.

సర్పంచ్ ల బిల్లులు ఇవ్వకుండా, ఎన్నికలు జరగకుండా వారి బిల్లులు చెల్లించకుండా తప్పించుకుంటుంది. పార్లమెంట్ ఎన్నికలకు, 6 హామీలకు సంబంధం ఏంటో కాంగ్రెస్ చెప్పాలి. మీకు కేసిఆర్ కి పెద్ద తేడా ఏమీ లేదు..కేసిఆర్ తొవ్వలోనే నడుస్తున్నారు. ప్రధాన మంత్రిని గౌరవించడం నేర్చుకోండి, రాష్ట్ర అభివృధ్దిని చేసుకోండి. తెలంగాణలో 10 నుండి 12 పార్లమెంట్ స్థానాలు బీజేపీ తప్పకుండా గెలుచుకుంటుంది

LEAVE A RESPONSE