మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తే నోటిఫికేషన్ ఇవ్వండి

-డేట్ చెప్పింది మీరే.. నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పింది మీరే
-నోటిఫికేషన్ ఇయ్యకపోవడానికి కారణం ఏంది?
-ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు?
-బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్

ఫిబ్రవరి ఒకటో తారీకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తాము, డీఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లు 24 రకాల డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు అయ్యేలా చేస్తాము, ఏప్రిల్ ఒకటో తారీకు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తాము అని అన్నారు.

ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖు, ఎన్నికల సందర్భంగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు అన్ని మేనిఫెస్టోలో మాదిరి కాదు. అన్ని పార్టీల మాదిరి మా పార్టీ కాదు. మా మేనిఫెస్టో ఒక భగవద్గీత మా మేనిఫెస్టో ఒక ఖురాన్ మా మేనిఫెస్టో ఒక బైబిల్ అని చెప్పారు వాళ్లు.

నమ్మించి ఓట్లు వేయించుకున్నారు దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత నమ్మి మీకు ఓటు వేశారు. దేనికోసం ఓటేశారంటే ఫిబ్రవరి ఒకటో తారీకు కోసం, ఏప్రిల్ ఒకటో తారీకు కోసం. ఈ రెండు తేదీలకు నోటిఫికేషన్లు వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, మా బ్రతుకులు మారతాయని చెప్పి యువత అంతా కూడా నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఈరోజు యువతను కాంగ్రెస్ పార్టీ నమ్మించి నట్టెట్లా ముంచింది.

ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా మాట్లాడటం లేదు, డేట్ చెప్పింది మీరే, నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పింది మీరే, బైబిల్ అన్నది మీరే, భగవద్గీత అన్నది మీరే, ఖురాన్ అన్నది మీరే దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి.

నోటిఫికేషన్ ఇయ్యకపోవడానికి కారణం ఏంది, ఇది మీ మ్యానిఫెస్టోనే, మీరు అనుకున్న ఖురాన్ ఇదే, మీరు అనుకున్న బైబిల్ ఇదే, మీరు అనుకున్న భగవద్గీత ఇదే….కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి విమర్శకు, విమర్శ కాకుండా సమాధానం చెప్పాలి కాంగ్రెస్ నాయకులు.

30 లక్షల మంది నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పాలి. మీ మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథం గా భావిస్తే నోటిఫికేషన్ ఇవ్వండి. లేదంటే పవిత్ర గ్రంథం లాగా మీరు చూస్తున్న మేనిఫెస్టోను నిరుద్యోగ యువత చెత్త కాగితాలు అని భావించాల్సి వస్తుంది.

కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థం చేసుకొని వెంటనే మీ మ్యానిఫెస్టో లో ఉన్న విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎన్నికల కోడ్ రాకముందుకే నిజాయితీతో నిబద్దతతో నోటిఫికేషన్లు ఇవ్వాలి.

ఆ పార్టీ వాళ్లు ఆపారు, ఈ పార్టీ వాళ్లు ఆపారు అని కుంటి సాకులు చెప్పకుండా నిజాయితీతో నిబద్ధత యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే, మీ హామీలను నెరవేర్చినప్పుడే కాంగ్రెస్ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తారు

యాసంగి ప్రారంభమైంది ఎకరానికి 15000 ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదు. రైతు భరోసా పేరుతో ఎకరానికి 15000 ఇస్తానని చెప్పి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఆపడానికి అభ్యంతరాలు ఏంది? నోటిఫికేషన్లు ఎవరు ఆపారు? రైతుబంధును ఎవరు ఆపారు? ఇవ్వడానికి కారణం ఏంటి? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీరు ఇచ్చిన మాటే అది.

బీఆర్ఎస్ పార్టీ రైతులను నట్టేట ముంచిందిచ్చి, మరి మీరు ఏం చేస్తున్నారు. రైతులు ఆదుకుంటారా ఆదుకోరా? చెప్పాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ లపై ప్రజలకు నమ్మకం లేదు. ప్రజలకు కేవలం మోడీ గ్యారెంటీ పై మాత్రమే నమ్మకం ఉన్నది. మోడీపై మాత్రమే ప్రజలకు విశ్వాసం ఉంది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు అది మంచి పథకమే. కానీ ఆటోలపై ఆధారపడ్డ ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఈరోజు ఏం సమాధానం చెప్తారు? ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నది.

నిన్నటి రోజున ఆటో డ్రైవర్ కుటుంబం గడవక తన ఆటోను స్వయంగా తగలబెట్టుకున్నాడు. గతంలో రైతులు సరిగ్గా పంట పండగ పోతే సరైన దిగుబడి రాకపోతే వారు వారి పంటను కాలబెట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు ఆటోలను కాలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆటో డ్రైవర్లను ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.

మీరిచ్చిన హామీలను 100 రోజుల పేరుతోనో ఎన్నికలకు కోడ్ తో తప్పిస్తే ప్రజలు కాంగ్రెస్ ను తప్పిస్తారని గుర్తుపెట్టుకోవాలి.

ప్రపంచంలో ఏ సర్వే సంస్థ కూడా చివరికి కాంగ్రెస్ సర్వే సంస్థలు కూడా కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ రాదని స్పష్టం చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం 350 కి పైగా సీట్లను గెలుచుకొని మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చెప్పకనే చెబుతూ అమలు చేయమని చెప్పింది. ఇక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఏమని ఓటు వేస్తారు. ఈరోజు తెలంగాణలోని 17 సీట్లను కాంగ్రెస్ గెలుస్తదా? కేంద్రంలో మరోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది జగమెరిగిన సత్యం.

మేము 6 గ్యారంటీలను అమలు చేయలేమని చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వము చేతులు ఎత్తేసింది. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఈ ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుందా లేదా అని ఆలోచిస్తున్నారు. రోజ్గార్ యోజన ద్వారా బిజెపి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది అని కాంగ్రెస్ పార్టీ వాళ్లు గుర్తుంచుకోవాలి.

అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిరాన్ని ప్రారంభించాము, ఆర్టికల్ 370 ని రద్దు చేశాము, త్రిబుల్ తలాక్ నిషేధించాము, ఈ విధంగా మోడీ ఇచ్చిన హామీలన్నీటిని నెరవేర్చాము

Leave a Reply