పీఆర్సీ జీవితాల్లో వెలుగు కాదు..అందరూ తినంగా మిగిలిన విస్తరి

– ప్రెస్ ,మీడియా అన్నలూ మీకో దండం
ఉద్యోగులకు పీఆర్సీ వరం..ఖజానాకు ..కోట్ల భారం..త్వరలో పీఆర్సీ 4లక్షల మందికి లాభం….ప్రభుత్వ కోశాగారం ఖాళీ ..అని భారీ హెడ్డింగ్ లతో ముందు పేజీలో ఇప్పటికే ఎన్నో సార్లు వేశారు..దీనిపై ప్రముఖ ఛానల్లలో డిబేట్ లు..
ఓ ప్రభుత్వ ఉద్యోగిగా నా అభిప్రాయం కూడా తీసుకోండి.
పీఆర్సీ అనేది ఓ సాధారణ అంశం..మేం పనిచేసినందుకు మాకిచ్చే కూలి.
5 ఏళ్లలో ప్రభుత్వాలు,దలారులు,బ్రోకర్లు,రియలటర్లు, పెంచిన ధరలకు అనుకూలంగా బతకలేని స్థితిలోకి వెళ్లిన మాకు పాలేర్ల కు విసిరేసి నట్టు విసిరేసే ఎంగిలాకు విస్తరి..
నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగి కి సొంత ఇల్లు ఉండదు.ఎవడన్న డాంబికానికి కట్టుకున్న 20 నుంచి 30 లక్షల బ్యాంకు అప్పు లేనిదే ఇల్లు కట్టడు.. పిల్లలని సరిగా చదివించే స్థోమత ఉందా.. ?
ఓ డాక్టర్ను చదివించే స్థోమత ఉందా..?
ఉద్యోగుల పిల్లలకు scholorship రాదు, అప్ప్పులేకుండా పెళ్లిచేసే స్థోమత ఉందా…?
.ఇప్పుడు పెన్షన్ సౌకర్యం కూడా లేదు….ప్రభుత్వ ఉద్యోగం లోకి వచ్చి నిజాయితీగా,కేవలం జీతం తో కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు..??
అందుకే ప్రెస్ అన్న లకు దండం..
ప్రజల్లో మాపై లేని పోనీ గొప్పలు ఒకప్పుడు..నీచులు లన్చగొండులు అని ఇప్పుడు…
ముద్రలు వేస్తూ,మాకు జీతాలు దండగ అంటూ కథనాలను వేసిందే వేసి,
చూపిందే చూపి, అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు ఫుట్బాల్ ఆడుతుంటే దిక్కులేని స్థితిలో ఉన్నాం…లోపల చినిగిన బనియిన్లు వేసి ,వేసిన నాలుగు జతల బట్టలనే మార్చి మార్చి వేసి పైకి ఉద్యోగిగా డాంబికాలకు పోతూ..చేసిన అప్పుల తో నలిగి..నలిగి స్ట్రెస్ తో హార్ట్ ఎటాక్ తో సంకనాకి పోతున్నాం…మీడియా సగటు ఉద్యోగి జీవన విధానం పై నిజమైన కథనాలు వేసి,..తెలివైన నెక్స్ట్ జనరేషన్ ప్రభుత్వ ఉద్యోగం పై మక్కువ పెంచుకొని జీవితాన్ని పాడుచేసుకోకుండా చూస్తే మంచి చేసిన వారు అవుతారు….
ప్రభుత్వ ఉద్యోగి అంటే ఆత్మ గౌరం తాకట్టు పెట్టుకొని బతికే బానిస అని యువతకు అర్థం అయ్యేలా కథనాలు వేస్తే మంచిది.
ఇక పీఆర్సీ విషయానికి వస్తే ..అది మా హక్కు అని బయటికి చెప్పే స్థితిలో లేకపోయినా కనీస అవసరాలు తీర్చే ఓ ఆశ..దాన్ని గుంజి గుంజి బేరమాడి కంటి తుడిపు చర్యగా మారింది …దాన్ని కూడా పాలకుల ఇంట్లో నుంచి ఇచ్చినట్టు 1% పెరిగితే ఖాజానకు ఇన్ని కోట్ల భారం అంటూ లెక్కలేసి ప్రజల్లో ఒకరకమైన ఈర్షా ద్వేషాలు ఉద్యోగుల పట్ల కలిగేలా చేయడం బాధాకరం.. పీఆర్సీ జీవితాల్లో వెలుగు కాదు..అందరూ తినంగా మిగిలిన విస్తరి..ఎమ్ చేస్తాం అది తినకపోతే మేం బతలేం కదా……

ఓ సగటు ఉద్యోగి

Leave a Reply