శాలువాతో సత్కరించి,ఆయన అభిమానానికి దన్యవాదాలు తెల్పిన మంత్రి
భీంగల్: భీంగల్ మండలంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు అభివృద్ది పనుల ప్రారంభ కార్యక్రమాల్లో భాగంగా పర్యటిస్తున్న సందర్భంగా పల్లికొండ గ్రామం మీదుగా వెళ్తుండగా బిఆర్ఎస్ నేత గంఘం కిషన్ ఇంటి వద్ద అగారు. మంత్రి వేముల చేసిన అభివృద్ది పై బతుకమ్మ పాట కై గట్టిన అదే గ్రామానికి చెందిన వృద్దుడు మేకల(గంఘం)రాజన్న తన పాట పాడి వినిపించాడు.
ఆయన పాటకు అక్కడ ఉన్న యువత,బిఆర్ఎస్ శ్రేణులు గొంతు కలిపారు. తనపై అభిమానంతో బతుకమ్మ పాట రూపొందించిన రాజన్నను మంత్రి వేముల శాలువాతో సత్కరించి దన్యవాదాలు తెలిపారు. రాజన్న అనేక సామాజిక అంశాలపై పాటలు రూపొందించాడని తెలుసుకున్న మంత్రి ఆయన పాటలన్నీ బుక్ ముద్రణ వేయిస్తనని హామీ ఇచ్చారు. సామాజిక స్పృహ కలిగిన పాటలు పుస్తక రూపంలో,ఆడియో రూపంలో నిక్షిప్తమై ఉంటే ఎక్కువ మందికి చేరుతాయని,భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయి అని అన్నారు.