ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్ మహిళలు

-చారిత్రాత్మక ప్రగతి సాధించిన ఆడపడుచులు
-మహిళలకు అండగా జగన్ ప్రభుత్వం
-ఎంపీ విజయసాయిరెడ్డి

మార్చి 8, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తుందని రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి అన్నారు.ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆంధ్రప్రదేశ్‌ మహిళలు తాము సాధించిన ప్రగతిని గుర్తుచేసుకునే గొప్ప సందర్భమని చెప్పారు. తెలుగు మహిళలు ప్రపంచ స్త్రీలు, భారత సోదరీమణులతో పాటు వేగంగా ప్రగతిపథంలో ముందుకు పరిగెడుతున్నారని కోనియాడారు..అమ్మ ఒడి పథకం అమలు వల్లన రాష్ట్రంలో మహిళ అక్షరాస్యత అనూహ్యరీతీలో పెరిగిందని చెప్పారు..తల్లులు తమ పిల్లలను బడులకు పంపడానికి అమ్మఒడి కార్యక్రమం ఎంతగానో ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. పిల్లల చదువు ఖర్చుల కోసం ఏటా తల్లి బ్యాంకు ఖాతాలోకి రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం అమ్మ ఒడి కింద జమచేస్తోంది, దీని ఫలితంగా స్కూళ్లలో చేరే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.

మహిళల సాధికారత కోసం వైఎస్సార్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ కాపునేస్తం, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం వంటి అనేక పథకాలు ఆంధ్రప్రదేశ్‌ లో అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర సర్కారు అనేక పథకాల కింద నేరుగా స్త్రీల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడంతో సాధికారతతో పాటు వారి కొనుగోలు శక్తి ఏటా పెరుగుతోందని చెప్పారు. గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ ప్రవేశపెట్టాక ప్రభుత్వం మహిళల వాకిళ్లకు వచ్చేసిందని పెర్కొన్నారు.

రేషన్‌ సరుకులు ఇళ్లకే తెచ్చి ఇస్తున్నారని,తెలుగునాట స్త్రీలు చిన్న చిన్న అవసరాలకు బయటకు పరుగులు తీసే అవసరం లేకుండా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలు వారికి అండగా నిలుస్తున్నాయని వెల్లడించారు. మహిళా పోలీసు వ్యవస్థ, దిశా చట్టం, దిశా యాప్‌ ఆడపడుచుల భద్రతకు అన్ని గ్రామాల్లో రక్షణ కవచంలా పనిచేస్తున్నాయని చెప్పుకోచ్చారు.

2004–2009 మధ్య జననేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అఖిలాంధ్ర మహిళాలోకం అన్నగా ప్రవేశపెట్టిన అనేక పథకాలకు అదనంగా 2019 మే ఆఖరు నుంచి వైఎస్సార్సీపీ సర్కారు అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు మున్నెన్నడూ లేని స్థాయిలో మహిళల సర్వతోముఖాభివృద్ధిగా దోహదం చేస్తున్నాయని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

Leave a Reply