దళితద్రోహి జగన్ రెడ్డి

– వైసిపి పాలనలో దళిత మహిళలకు కూడా రక్షణ కరవు
– వాయల్పాడు శివార్లలో యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించిన మాలమహానాడు ప్రతినిధులు

• దళితులు నేటి సమాజంలో ఆర్థిక, సామాజిక రంగాల్లో పూర్తిగా వెనకబడి ఉన్నారు.
• దళితుల అభివృద్ధికి గతంలో ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయి.
• ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక చేయూత అందించి మమ్మల్ని ఆదుకునేవారు.
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాల పేరుతో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించడమేగాక గతంలో మా సంక్షేమానికి అమలుచేసిన 27 పథకాలను రద్దుచేసింది.
• బెస్ట్ ఎవైలబుల్ స్కీమ్ రద్దుచేయడం వల్ల దళితుల పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు.
• గతంలో అంబేద్కర్ విదేశీవిద్య పథకం ద్వారా వందలాది దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం ఉండేది.
• టిడిపి హయాంలో ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ ద్వారా వేలాది కుటుంబాలు భూమిని పొంది ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి.
• గతంలో దళిత నిరుద్యోగులకు ఇన్నోవా వాహనాలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించారు.
• ఆ పథకాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేశారు.
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి సాయం అందించిన పాపానపోలేదు.
• ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ అమలుకు వైసిపి ప్రభుత్వం నిరాకరిస్తోంది.
• జిఓఎంఎస్ 77 ద్వారా విద్యాదీవెన, వసతిదీవెన తప్ప ఏ కోర్సులో ఉన్నత విద్య అభ్యసించినా ఉపకార వేతనాలు ఉండవని ప్రభుత్వం తెలిపింది.
• ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను నాలుగేళ్లుగా ప్రకటించలేదు.
• ఇళ్లస్థలాల పేరుతో దళితులకు చెందిన 11వేల ఎకరాల భూములను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది.
• నూతన పారిశ్రామిక విధానంలో దళితులకు ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసి సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరించి మాకు న్యాయం చేయండి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు మాయమాటలుచెప్పి ఓట్లువేయించుకొని అధికారంలోకి వచ్చాక వారిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
• ఎస్సీ సంక్షేమ పథకాల రద్దు, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మళ్లింపుతో దళితులకు తీరని అన్యాయం చేసిన దళితద్రోహి జగన్ రెడ్డి.
• ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దళితులపై జగన్ ఉక్కుపాదం మోపుతూ అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు.
• వైసిపి పాలనలో దళిత మహిళలకు కూడా రక్షణలేకుండా పోయింది. పులివెందులలో దళితమహిళ నాగమ్మపై కిరాతకంగా అత్యాచారం చేసి హత్యచేస్తే చర్యలు లేవు.
• తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులకు న్యాయం చేస్తాం.
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం.
• దళితులపై వేధింపులకు పాల్పడిన వైసిపి నేతలను కఠినంగా శిక్షిస్తాం.
• ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది.

Leave a Reply