– జ్యోతి యర్రాజీ ప్రయాణంపై అనిల్ కుంబ్లే గతేడాది భావోద్వేగ పోస్ట్!
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తరపున 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడిన మొట్టమొదటి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన విశాఖ అమ్మాయి జ్యోతి యర్రాజీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే, జ్యోతి ఎదుగుదల వెనుక ఉన్న కృషిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అప్పుడు వైరల్ అవుతోంది.
గాండీవ ప్రాజెక్ట్ – పునాది వేసిన విజన్
జ్యోతి యర్రాజీ ఈ స్థాయికి చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘గాండీవ ప్రాజెక్ట్’ కీలక పాత్ర పోషించిందని కుంబ్లే పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా అనిల్ కుంబ్లేకు చెందిన TENVIC సంస్థ, క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించడంలో కీలక భాగస్వామిగా వ్యవహరించింది.
కుంబ్లే మాటల్లో జ్యోతి ప్రస్థానం:
* గుర్తింపు: గాండీవ ప్రాజెక్ట్ ద్వారా గ్రామీణ స్థాయిలో జ్యోతిలోని ప్రతిభను TENVIC గుర్తించింది.
* శిక్షణ: పోషకాహారం నుంచి మానసిక దృఢత్వం వరకు, ప్రతి వారం మరియు నెలవారీ సమీక్షలతో జ్యోతికి సమగ్ర శిక్షణ అందించారు.
* ప్రస్థానం: సామాన్య కుటుంబం నుంచి వచ్చిన జ్యోతి, తన పట్టుదలతో నేడు ఒలింపిక్స్ వంటి విశ్వ వేదికపై నిలబడటం గర్వకారణమని కుంబ్లే కొనియాడారు.
“ఒక సామాన్య అథ్లెట్ నుంచి ఒలింపియన్ స్థాయికి జ్యోతి ఎదిగిన తీరు అద్భుతం. ఆమె అంకితభావానికి, సరైన మార్గదర్శకత్వం తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయో జ్యోతి నిరూపించింది,” అని కుంబ్లే తన సందేశంలో పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రం గర్వించేలా..
విశాఖపట్నంలో ఒక సెక్యూరిటీ గార్డ్ కుమార్తెగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న జ్యోతి, అర్జున అవార్డు వరకు ఎదిగింది.
–చాకిరేవు