( గుమ్మడి రామకృష్ణ)
ఈమధ్య కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన పార్టీ నతల సమావేశంలో ఒక విషయం నొక్కి వక్కాణిస్తున్నారు. అదేమిటంటే.. ఇంటింటికీ వెళ్లండి. చేసిన మంచి పని చెప్పండి అని! మరి జగనన్న ప్రభుత్వం జనాలకు చేసిన ఆ మంచేమిటో మనమూ చెప్పుకోవాలి కదా? అవేమిటో కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇంటింటికీ వెళ్ళండి .మనం చేసిన మంచి చెప్పండి.
1) మందు రేట్లు నాలుగు రెట్లు పెంచాము అని చెప్పండి. అన్నీ మన సొంత బ్రాండ్స్ అని చెప్పండి.
2) ఆర్టీసీ రేట్లు పెంచాము అని చెప్పండి.
3) కరెంట్ రేట్లు ఏడు సార్లు పెంచాము అని చెప్పండి.మళ్ళీ పెంచుతాము అని చెప్పండి.
4) దేశంలో అందరికంటే మన దగ్గరే పెట్రోలు రేట్లు ఎక్కువ అని చెప్పండి.
5) ఆస్తిపన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచామని చెప్పండి.
6) రోడ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేసే ప్రసక్తే లేదని చెప్పండి.
7) చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం మనది అని చెప్పండి.
8) దేశం లో ద్రవ్యోల్బణం ఎక్కువగా వున్న రాష్ట్రాల్లో మనము ముందు వున్నామని చెప్పండి.
9) అమరావతి రైతులను మోసం చేసి , రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసాము అని చెప్పండి.
10) ఐటీ లో బీహార్ కంటే వెనక వున్నామని చెప్పండి.
11) గంజాయి , డ్రగ్స్ లో మనమే నంబర్ వన్ అని చెప్పండి.
12) అప్పుల్లో మనమే నంబర్ వన్ అని చెప్పండి.
13 దాదాపు, 7 లక్షల కోట్లు అప్పు చేసి , రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాము అని చెప్పండి.
14) దౌర్జన్యాలు ,దాడుల్లో బీహార్ కంటే మనమే ముందున్నాము అని చెప్పండి.
15) కోర్టు లలో మొట్టికాయలు వేపించుకోవడం లో మనది దేశం లో నే ఎవరూ దాటలేని రికార్డ్ అని చెప్పండి.
16) అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చెయ్యడం లో మనకు తిరుగులేదని చెప్పండి.
17) కేసుల కారణం గా కేంద్రాన్ని అప్పులు తప్ప ,ఏమి అడగలేమని చెప్పండి.
18) ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితి కి రాష్ట్రాన్ని తీసుకొచ్చాం అని చెప్పండి.
19) ప్రజలకుచారానా పంచి , మనము బారానా మింగటం తప్ప మనకు ఏమీ చేతకాదు అని చెప్పండి.
20) మరొక్క సారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సాంతం నాకేస్తాం అని చెప్పండి.
పైన తెలిపినటువంటి అంశాల్లో ఏ ఒక్కటి తగ్గేదే లే.. అని చెప్పండి…..