Suryaa.co.in

Andhra Pradesh

రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును నీరుగార్చేందుకే వ్యవసాయ మోటార్లకు మీటర్లు

– ప్రజా, రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించాలి
-రైతన్నల మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారు,
-మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమి లేదు,
-రుణమాఫీ పేరుతో రైతులు, మహిళలను మోసం చేసిన సీఎం,
-వైసీపీ ప్రతి మోసాన్ని బయటపెడతాం,రైతులను మోసం చేస్తే చూస్తు ఊరుకోం జగన్ రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవెర్చలేదు,
-నాడు టీడీపీ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు
-అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్

సంతమాగులూరు మామిళ్ళపల్లి గ్రామ పర్యటనలో ఉన్న శాసనసభ్యులు గొట్టిపాటి.రవికుమార్ దృష్టికి ఆ గ్రామానికి చెందిన పలువురు రైతులు, స్థానిక ప్రజలు,వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తున్నారని అంతేకాకుండా కరెంటు బిల్లులు గతంలో కంటే 30-40శాతం అదనంగా వేశారని,ఇలాగైతే వ్యవసాయం చేసే పరిస్థితి లేదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ని కలసి ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ…మోటార్లకు మీటర్లు పెట్టడం లాభమని చెప్పడం జగన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు పై ఆరోజు విషప్రచారం చేసిన జగన్ రెడ్డి… ఈరోజు అవే మీటర్లు రైతులకు మేలుచేస్తాయనడం హాస్యాస్పదమని అన్నారు.అన్న నందమూరి తారకరామారావు హయాంలో తెలుగుదేశం పాలనలో హార్స్ పవర్ కి 50 రూపాయల స్లాబ్ విధానం తీసుకురావడం వలన మెట్ట రైతుల ఆర్ధిక పరిస్థితి మెరుగుపడింది. జీవితంలో ఊహించని విధంగా మెట్ట రైతులు ఆర్ధికంగా బలపడ్డారు, మెట్టలో వరిసాగు, అపరాల సాగు పెరిగింది. తండ్రి దివంగత రాజశేఖర్ రెడ్డి పేరుతో ఆధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రైతాంగంపై ఆధిక భారాలు మోపటం అన్యాయం.ఒకవైపు పెట్టబడిసాయం చేస్తూ మరోవైపు రైతాంగానికి నష్టం చేసి నగదు బదిలీ పథకాన్ని తీసుకు రావటం చాలదారుణం. స్వర్గీయ రాజశేఖరరెడ్డి ఉచితంగా కరెంట్ ఇచ్చి వ్వసాయాన్ని ప్రోత్సాహం ఇస్తే, కుమారుడు మాత్రం మోటార్లకు మీటర్లు పెట్టి రైతన్నలకు కరెంట్ షాక్ ఇవ్వడం బాధాకరమన్నారు.

రాజశేఖర్ రెడ్డి పేరు తో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రైతాంగం పై అధిక భారాలు మోపటం అన్యాయం. కానీ ఈ రోజు మోటర్లకు మీటర్లు బిగించి,రైతు మెడకు ఉరి బిగించే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం.రైతు ముందుగానే చెల్లించాలానే షరతుతో సున్నావడ్డీ మాదిరిగా నీరుగార్చేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.మోటర్లకు మీటర్లు పెట్టి రైతులకు రూ 4వేల కోట్లు ఎగ్గొట్టే పధకాన్ని రచించడం వైసీపీ ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు.

మోటార్లకు మీటర్లు పెట్టి,ఉచిత బోర్లు అనడం రైతుల మూతికి చిక్కం కట్టడమే.వ్యవసాయ విద్యుత్ కు మీటర్ల కొనుగోళ్ల వ్యయం రూ 2వేల కోట్లు ప్రజలపైనే భారం.వైసీపీ అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లులు మూడు నాలుగు రెట్లు పెంచేశారు,రైతులకు,పేదలకు రూ 15వేల కోట్ల కరెంట్ షాక్ ఇచ్చారు.ఒకవైపు రూ4వేల కోట్లు ఎగ్గొట్టడం రైతులకు ఒక ద్రోహం అయితే, మరోవైపు రూ 2,340కోట్లతో బోర్లు వేయిస్తాం అనడం వైసీపీ ప్రభుత్వం మరో ద్రోహం.ఎస్క్రో ఖాతాలు తెరిపించి రైతుల సొమ్ము రూ 4వేల కోట్లు డిస్కంల పరం. కేవలం 3 నుంచి 5గంటలు మాత్రమే రైతాంగానికి విద్యుత్ సరఫరా జరుగుతుంది,ఇచ్చే కొద్ది గంటలలో కూడా మధ్య మధ్యలో కోతలు విధించడం వల్ల మోటర్లు కాలిపోవటం, పంట తడిచిన చోట నుంచే తిరిగి తడుపుకునే పరిస్థితి నెలకొంది.ఇప్పటికే వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగుచేస్తూ నాణ్యమైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంట చేతికి రాదేమోనన్న ఆందోళనలో రైతాంగం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.

ధరల స్థిరీకరణ నిధి ఎక్కడా?
ఎన్నికల హామీలో భాగంగా 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, 4వేల కోట్ల తో ప్రకృతి విపత్తు నిధి ఏర్పాటు చేస్తామన్నారు,ఆ హామీ ఎక్కడ?ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి నిమిత్తం రూ.12500/-లు ఇస్తామని చెప్పి, రూ.7500/-లు మాత్రమే యిచ్చి , రూ.5000/-లు ఇవ్వకుండా రైతులను మోసం చేశారు.కౌలు రైతులకు కూడా పెట్టుబడి ఇస్తామని చెప్పి 15లక్షల మంది ఉంటే, 50వేలమందికే యిచ్చి దగా చేశారు. రైతన్నలకు వడ్డీలేని పంట రుణాలు 4వేల కోట్లు ఇస్తామని, ఒక వంద కోట్లకు కుదించి రైతులను మోసం చేశారు.

వైసీపీ ప్రభుత్వ జలకళ పథకం మరో మాయాజాలం
బోరు తవ్వితే మోటారు ఎవరిస్తారు?గత తెదేపా హయాంలో ఎన్టీఆర్‌ జలసిరి కింద.. బోరు, మోటార్‌,సోలార్‌ పంపుసెట్‌. ఈ పధకంలో ఉచిత బోరు,విద్యుత్ కనెక్షన్,5హెచ్‌పీ సోలార్ పంపు సెట్టు,మూడు కలిపి రూ.3,50,000 ఖరీదు చేసేవి,ఈ పధకం ద్వారా 50 వేలకు పైగా రైతులకు లబ్ది చేకూరింది.తెదేపా హయాంలో బీడుభూముల్ని సాగు భూములుగా మార్చేవిధంగా SC,ST సన్నకారు రైతులకు ఎన్టీఆర్ జలసిరి పధకం ఉపయోగడింది.గతంలో ఎస్సీ,ఎస్టీ రైతులు 6 వేలు కట్టేవారు.. ఇతరులు 25 వేలు చెల్లిస్తే వ్యవసాయ బోరు మోటారు సోలార్ పంప్ సెట్ ఉచితంగా ఇచ్చే ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని తెదేపా అమలు చేసింది.

తెలుగుదేశంపార్టీ హయాంలో అద్దంకి నియోజకవర్గంలోని సన్న,చిన్నకారు రైతులకు దాదాపు 4500పైచిలుకు జలసిరిబోర్లు వేయించడం జరిగింది.జగన్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమలులో ఉన్న ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్ని రద్దు చేసింది.రైతులకు ఉచితంగానే బోర్లు వేసేందుకు నియోజకవర్గానికి ఒక బోరు బండి కేటాయిస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీ ఆచరణలో ఎక్కడ?? వైఎస్సార్ జలకళ పేరుతో 2లక్షల బోర్లు వేస్తామని ప్రగల్భాలు పలికి చివరకు కాగితాల్లోనే పధకం అమలు. రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పథకం అటకెక్కింది,ఫర్ డ్రాప్ మోర్ క్రాప్ (చుక్క నీటితో చాలా పంట) సాధించే లక్ష్యంతో ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద కేంద్రం దేశవ్యాప్తంగా ఉద్యాన రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని అమలు చేస్తోంది.ఇతర రాష్ట్రాల్లో సజావుగా సాగుతున్న ఈ పథకం ఏపీలో మాత్రం అమలు కావడం లేదు.

తెదేపా హయాంలో డ్రిప్ స్పింకర్,పరికరాలు రైతులకు రాయితీపై అందించాం.నాడు2018-19డ్రిప్ ఇరిగేషన్ అమలులో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానం.2019-20నాలుగో స్థానానికి పడిపోయింది 21-22సంవత్సరంలో పూర్తిగా ఆపేయడం గమనార్హమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇన్ పుట్ సబ్సీడీ రూ.3,750 కోట్లు ఇవ్వగా.. జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.1,612 కోట్లు మాత్రమే ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాం కన్నా ఈ ప్రభుత్వ హయాంలోనే అధికంగా ప్రకృతి విపత్తులు జరిగాయి. అయినా ఇన్ పుట్ సబ్సీడీ తక్కువ ఇచ్చి, ఎక్కువ ఇచ్చినట్టుగా అబద్ధాలు చెప్పారని గుర్తుచేశారు. పైగా కేంద్ర విపత్తు సహాయ నిధురు రూ.1,100 కోట్లు దారి మళ్లించి రైతుల్ని దగా చేశారన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి2,112 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా.. కేవలం 718 మాత్రమే పరిహారం చెల్లించి దాదాపు 1400 మంది రైతులకు అన్యాయం చేశారు.రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఏపీ 3వ స్థానంలోనూ, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉన్నది. నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో రికార్డులు స్పష్టం చేసాయన్నారు.ఏపీలో 93.2శాతం రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. రాష్ట్రంలో ఒక్కో రైతు కుటుంబంపై సగటున 2,45,554 అప్పు ఉన్నట్లు జాతీయ గణాంక కార్యాలయం సర్వేలో తేలిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోకపోతే రైతులు/ప్రజలకు తెదేపా మద్దతుగా నిలిచి ఆందోళన చేసేందుకు వెనుకాడబోమని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గొట్టిపాటి హెచ్చరించారు.

LEAVE A RESPONSE