టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభల కరపత్రం ఆవిష్కరణ

ఈనెల 29,30 తేదీలలో హైదరాబాద్ లో జరుగనున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ద్వితీయ మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఈ సంఘం రాష్ట్ర మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు పులిపలుపుల ఆనందం, హెచ్ యూజే అధ్యక్షుడు ఈ. చంద్రశేఖర్, నాయకులు రాజశేఖర్, రఘు తదితరులు పాల్గొన్నారు.