ప్రజాప్రతినిధులపై కేసులు ఎత్తివేస్తూ ఇచ్చిన జీవో ఉపసంహరణ

కేసులు ఎత్తివేస్తూ ఇచ్చిన జీవోలన్నీ ఉపసంహరించుకున్న ప్రభుత్వం

అమరావతి : ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ ఇచ్చిన జీవోలన్నింటినీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ ఇచ్చిన జీవోపై… జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం కేసులను ఉపహసంహరిస్తోందని పిటిషనర్ న్యాయవ్యాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.

ప్రజాప్రతినిధులపై కేసులు ఉపసంహరించాలంటే స్థానిక హైకోర్టు అనుమతి తీసుకోవాలని పిటిషనర్ న్యాయవాది గతంలో ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా ఉపసంహరిస్తారని గతంలో ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం తరుఫున ప్రమాణ పత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ప్రజా ప్రతినిధులపై కేసులు ఉపసంహరిస్తూ ఇచ్చిన మొత్తం జీవోలను ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు న్యాయస్థానానికి తెలిపింది. ప్రభుత్వం కేసులు కొనసాగించడంతో.. హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మూసివేసింది.

మిడ్ లెవెల్ హెల్త్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీపై హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

రాష్ట్రంలో 1681 హెల్త్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి బ్రేక్
మిడ్ లెవెల్ హెల్త్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీపై హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. మిడ్ లెవల్ హెల్త్‌ సూపర్ వైజర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియపై స్టే విధిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 1681 హెల్త్‌ సూపర్ వైజర్‌ పోస్టుల భర్తీకి బ్రేక్ పడింది.సింగిల్ జడ్జ్‌ ఇచ్చిన తీర్పును డివిజినల్ బెంచ్ నిలిపివేసింది. గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుపై డివిజినల్ బెంచ్లో శివకృష్ణ రిట్ అప్పీల్‌ దాఖలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు విరుద్దంగా ఆయుష్‌ డాక్టర్ల పేర్లను పరిశీలనలోకి తీసుకోకుండా, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని పిటిషనర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.జాతీయ ఆరోగ్య విధానం-2017, ఆయుష్‌మాన్‌ భారత్‌ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేసిందన్నారు.

నోటిఫికేషన్‌ ప్రకారం.. బీఎస్సీ(నర్సింగ్‌)ను విద్యార్హతగా పేర్కొన్నారని జడ శ్రావణ్ కుమార్ అన్నారు.దేశంలోని ఏపీ మినహా అన్ని రాష్ట్రాలు… పోస్టుల భర్తీలో ఆయుర్వేద వైద్యులకు అవకాశం కల్పిస్తున్నాయన్నారు. ప్రభుత్వం తరఫున భర్తీకి అవకాశం ఇవ్వాలని.. రాబోయే ఎంపికల్లో వారి పేర్ల పరిశీలనకు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.మార్గదర్శక సూత్రాలకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వాదనలు విన్న న్యాయస్థానం ప్రక్రియపై పై స్టే విధించింది. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ గ్రామీణ ఆరోగ్య క్లినిక్లు- ఆరోగ్య, వెల్‌నెస్‌ కేంద్రాల్లో 1681 ఎంఎల్‌హెచ్‌పీ నియామకం కోసం ఈ ఏడాది ఆగస్టు 9న ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమంపై మిషన్‌ డైరెక్టర్‌ ఇచ్చిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ వైద్యులు పి.అనీల్‌కుమార్, శివకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు.ప్రక్రియలో ముందుకెళ్లడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఇస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు.

Leave a Reply