– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
రాజ్యాంగం గురించి మంత్రి బొత్స మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. చెత్తమీద కూడా పన్నువేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ఆయనకు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కుందా? ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో యథేచ్ఛగా నాటుసారా పంపిణీచేసిన ఆయనకు రాజ్యాంగం గురించి మాట్లాడే ఉందో లేదో ఆయన మనస్పాక్షినే అడగాలి . అంబేద్కర్ ఆశయాలకు జగన్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారు .
అమరావతిలో 25 ఎకరాల్లో రూ. 100 కోట్లతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చంద్రబాబు గారు నిర్ణయిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గండికొట్టారు. అంబేద్కర్ నమూనా విగ్రహాలను చోరీ చేసిన వారిని కూడా ఇంతవరకూ పట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వమిది. మీరా రాజ్యాంగస్పూర్తి గురించి మాట్లాడేది? వాటిగురించి తెలియకుండా బొత్స మాట్లాడుతున్నారు. నోరు తెరిస్తే చాలు…కాల్ మనీలో తెలుగుదేశం వాళ్లున్నారని అంటున్నారు. నిజంగా మీరు చెప్పేదే నిజమైతే, మీప్రభుత్వం వచ్చి రెండున్న రేళ్లు అయ్యింది.
కాల్ మనీలో ఉన్న టీడీపీ నేతలపై ఎందుకుచర్యలు తీసుకోలేకపోయారు ? వోక్స్ వ్యాగన్ విషయాలు మాట్లాడే దమ్ము బొత్సకు ఉందా ?సొమ్ములు పోనాయి నేనేటి సేత్తానంటూ చేతలు దులుపుకుంటే సరిపోతుందా? వోక్స్ వ్యాగన్ కంపెనీ పెట్టేందుకు జర్మనీ నుంచి వ్యక్తి ఏమయ్యారో బొత్స చెప్పాలి. చంద్రబాబు గారిని విమర్శించే స్థాయి బొత్సకు ఎక్కడిది? రూ. 5 వేల కోట్ల ఇళ్ల స్కామ్ సూత్రధారి ఎవరో బొత్స చెప్పాలి. వైఎస్ హయాంలో 14 లక్షల ఇళ్లు కట్టామంటున్న బొత్స అవి ఎక్కడున్నాయో చూపించాలి. చంద్రబాబు పేదల కోసం కట్టించిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు చేసే అధికారం మీకెక్కడిది?
రెండున్నరేళ్లలో ఏపీని భ్రష్టు పట్టించారు. చంద్రబాబు గారు పేదలకోసం కట్టిన ఇళ్లను, అమరావతిని,పోలవరాన్ని, పరిశ్రమలను తరిమికొట్టి రాష్ట్రాన్ని పాడుపట్టించారు. విధ్వంసకర పాలన కొనసాగిస్తున్న మిమ్మల్ని జనం పాడుపట్టించేరోజులు దగ్గరకొచ్చాయని గుర్తుంచుకోండి. ఆర్టీసీ బస్సులకు పసుపురంగు ఉంటే దాన్ని తీసేయమని మీరు మాట్లాడతారా? ఇప్పుడు మీరుచేసే పనులకు జనం మిమ్మల్ని కాటేయకపోతే చూడండి. మీరంతా ప్రజలదెబ్బకు బులుగురంగుల్లో ఏ రకంగా కనిపించబోతున్నారో చూసుకోండి.
ఎంపీ రఘురామరాజుని పట్టుకొని వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో తిడుతుంటే తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏంచేస్తున్నారో మీకే తెలియాలి. వైసీపీ నేతలు మహిళా అధికారులను చీరేస్తామని, చించేస్తామని బెదిరించడం, బూతులు తిట్టడం దారుణం. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీడీవో కేఆర్. విజయను వైసీపీ నేత తాతాజీ చీరేస్తానంటాడా? గతంలోనూ నెల్లూరుజిల్లాలో మహిళా ఎంపీడీవో సరళగారిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నానాఛండాలంగా ప్రవర్తించాడు. ఇళ్లకు వెళ్లి బూతులుకూడా తిట్టారు. మహిళా అధికారులను పనిచేసుకోనివ్వకుండా వైసీపీఎమ్మెల్యేలు, ఇతరనేతలు ఇష్టానుసారం బూతులు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు?
మీరా మహిళా సాధికారత గురించి అసెంబ్లీలో మాట్లాడేది? చిత్తూరుజిల్లాలో పనిచేసే అనితరాణిని ఏవిధంగా వేధింపులకు గురిచేశారో దేశమంతాచూసింది. మహిళలనే గౌరవం కూడాలేకుండా చీరేస్తాము.. చించేస్తాము అని మాట్లాడే మీరు కూడా రాజ్యంగం గురించి మాట్లాడేవారే. నిన్నగాకమొన్న జర్మనీకిచెందిన ఆటోమొబైల్ సంస్థ వేల కోట్లపెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే, తెలంగాణ నుంచి కేటీఆర్ హాజరవగా… ఆంధ్రా నుంచి ఒక్కరూ హాజరుకాలేదు. స్వయంగా పార్లమెంట్ లో కేంద్రపరిశ్రమలశాఖా మంత్రే చెప్పారు.. ఈరెండున్నరేళ్లలో తెలంగాణకు రూ.17వేలకోట్ల పెట్టుబడులువస్తే, ఆంధ్రాకు రూ.2,700కోట్లుమాత్రమే వచ్చాయని. అవికూడా చంద్రబాబునాయుడు సంతకం చేస్తే వచ్చినవే.
యువతను మద్యం, గంజాయి బారిన పడేసిన మీరు దానిగురించి ఆలోచించరు. వారు చెడువ్యసనాలకు లోనయ్యేలా వైసీపీప్రభుత్వం చేసింది. దానికి సమాధానంచెప్పగల ధైర్యం ఈ బొత్ససత్యనారాయణకు ఉందా అనిప్రశ్నిస్తున్నా? ఖబడ్దార్ వైసీపీ. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినవ్యక్తి, ఒక్కకేసు కూడా లేకుండా, ప్రజలకోసం, రాష్ర్ట్రాభివృద్ధికోసం పనిచేసిన వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఈ రెండున్నరేళ్లలో ఏంచేశారో చెప్పండి. మీకు ధైర్యముంటే నాలుగు గోడల మధ్యా ప్రెస్ మీట్లు పెట్టడం కాదు.. ప్రజలమధ్యకు వచ్చి పెట్టండి.