దద్దరిళ్లిన ఓయూ….పరిపాలన భవన్ ను ముట్టడించిన ఏబీవీపీ

దద్దరిళ్లిన ఓయూ….పరిపాలన భవన్ ను ముట్టడించిన ఏబీవీపీ

హైదరాబాద్: ఫీజు పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్ట్ లు భర్తీ చేయాలనీ,హాస్టల్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓయూ వీసీ బిల్డింగ్ ముట్టడి వేలది మంది విద్యార్థులతో దద్దరిలిన ఓయూ వీసీ ఆఫీస్. నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వ
abvp1యూనివర్సిటీలు విద్యా వ్యాపారానికి తెరలేపుతూ ఫీజులు పెంచడం దారుణం, కొత్తగా వచ్చిన వీసీలు ఏదో చేస్తామని ప్రగల్బాలు పలికి విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలతో ప్రభుత్వం అజెండాను విద్యార్థుల మీద రుద్దుతున్నారు.
ఉస్మానియా, కాకతీయ,మహాత్మా గాంధీ, జె ఎన్ టి యు హైదరాబాద్ యూనివర్సిటీలలో ఇంజనీరింగ్, పార్మసీ,పీజీ కోర్సు ఫీజులు భారీ మొత్తంలో పెంచుతూ నిర్ణయం చేయడం అన్యాయం . ముఖ్యoగా వందేళ్ల చరిత్రగల ఉస్మానియా యూనివర్సిటీ లో ఎంఏ(ఆర్ట్స్,సోషల్ సైన్స్ )రెగ్యులర్ కోర్సుల ఫీజు 2,800 నుండి 14,000 వరకు,3800 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ లకు 21,000 కు పెంచారు.ఎమ్ .కాం కు 30,000.ఎంబీఏ 35,000.ఎమ్మెసీ సైన్స్ కోర్సు లకు 3,800 నుండి 20,490,సెల్ఫ్ ఫైనాన్స్ 35,000 పెంచారు. ఇంజనీరింగ్ కోర్స్ ఫీజులను అయితే భారీగా పెంచారు 18000 నుండి 35,000 వరకు సెల్ఫ్ ఫైనాన్స్ 75,000 వరకు పెంచారు,ఇంక ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కోర్సు ‘ఫీ’ అయితే ఏకంగా లక్ష ఇరవైల(1,20,000) అంటే ఏవిదంగా వసూళ్లు చేస్తున్నారో అర్ధం అవుతుంది అన్నారు అదేవిధంగా హాస్టల్స్ సమస్యలు పరిష్కరించాలి డిమాండ్ చేశారు. ఫీజులు తగ్గించే వరకు ఉద్యమిస్తామని ఏబీవీపీ నేతలు హెచ్చరించారు.
ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రీహరి, ఓయూ విభాగ్ కన్వీనర్ &స్టేట్ జాయింట్ సెక్రెటరీ సుమన్ శంకర్, జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీశైలం వీరమళ్ళ, స్టేట్ జాయింట్ సెక్రటరీ జీవన్, కమల్ సురేష్,టెక్నికల్ సెల్ కన్వీనర్ తోట శ్రీను, వరుణ్, సాయి, అమర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply