తెలంగాణ ఉద్యమ క్రైస్తవ తొలి మహిళా నేత వసుంధర మృతి

తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించి, టిఆర్ఎస్ పార్టీలో అత్యున్నత స్థానం కెసిఆర్, జయశంకర్, నాయిని నర్సింహారెడ్డి మొదలగు రాష్ట్రస్థాయి నాయకత్వంతో ఉండి, తెలంగాణ ఆవిర్భావం తర్వాత టిఆర్ఎస్ పార్టీ తో ఉండి, కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ మహిళా సమాజానికి అదేవిధంగా తెలంగాణ క్రైస్తవ సమాజానికి సేవ చేసిన గొప్ప మహిళా నాయకురాలు బుసమల్ల వసుంధర (57) చనిపోవడం తీవ్ర నిరాశకు గురి దని క్రైస్తవ ఉద్యమ నేత జెరూసలేము మత్తయ్య నివాళులర్పించారు.

క్రైస్తవ సమాజం నుండి తెలంగాణ పోరాటంలో ముందు ఉండటంతో పాటుగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ ఇతర సీనియర్ నాయకులతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహిళల లో మొదటివారు. అదేవిధంగా మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి కి, తెలంగాణ వచ్చిన తర్వాత అనేక మంది పేద , దళిత క్రైస్తవులకు సేవాకార్యక్రమాలు చేస్తూ,మానవ హక్కుల పరిరక్షణ కృషి చేసిన వసుంధర ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారు.క్యాన్సర్ చికిత్స పొందుతూ , ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఆమె పార్థీవ దేహాన్ని సికింద్రాబాద్ సి ఎస్ ఐ డయాసిన్ ఆఫీస్ లో సందర్శనార్థం ఉంచారు. తెలంగాణ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ శంకర్ లూక్ సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు, . తెలంగాణ సమాజం ఒక మంచి నాయకురాలిని కోల్పోయిందని అన్నారు.

తెలంగాణ క్రిస్టియన్ హైకోర్టు న్యాయవాది సుదీర్ చాటల్ల , ప్రముఖ క్రిస్టియన్ చారిటీ సంస్థ హ్యాండ్ ఆఫ్ హోప్ కెన్నెడీ, జెరుషలేము మత్తయ్య , బుసమల్ల వసుంధర తండ్రి పేరు బి బెంజమిన్ శ్రీనివాస్, సోదరులుపాస్టర్ శ్యాం సుందర్, సునిల్ కుమార్,పాస్టర్ సుశీల్ కుమార్, సుదేష్ , సోదరి సంధ్య తదితరులు ఆమె కు నివాళులు అర్పించారు.

Leave a Reply