– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
ధరలు దిగిరావాలి-జగన్ రెడ్డి దిగిపోవాలి అనే నినాదంతో నేడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టాము. జగన్మోహన్ రెడ్డి పేదల ద్రోహి. 2014లో రాష్ట్రానికి రూ.16 వేలకోట్ల ఆర్థికలోటు ఉన్నప్పటికీ, నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేదల సంతోషమే తన సంతోషంగా భావించి, పండుగల వేళ వివిధ వర్గాల ప్రజలకు పండుగ కానుకలు అందించారు.
అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా జగనన్న పస్తుల పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా అనిపిస్తోంది. ఆనాడు చంద్రబాబునాయుడు సంక్రాంతి కానుక అందిస్తే, నేడు జగనన్న తన పస్తుల పథకాన్ని దిగ్విజయంగా అమలుచేస్తున్నారు.
ఆనాడు రూ. 5 కే అన్నక్యాంటీన్లద్వారా పేదలకు కడుపు నిండా భోజనం అందితే, నేడు అదే రూ. 5కి సింగిల్ ఇడ్లీ కూడా దొరకని దుస్థితి. ఓవైపు కరోనా కాటు…మరోవైపు ఈ తుగ్లక్ పాలనతో ప్రజలంతా హలోలక్ష్మణా అని ఏడుస్తున్నారు. పెరిగినధరలు, పన్నులుతో ప్రజలంతా లబో దిబోమంటుంటే కనీసం ఒక్క మంత్రి కానీ, , వైసీపీ నాయకుడుకానీ, ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టే పరిస్థితికూడా లేకుండాపోయింది. ఇంత దారుణమైన పరిపాలన మాకు అవసరమా అని రాష్ట్రప్రజలంతా అనుకుంటున్నారు.
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు
వస్తువు 2018-19టీడీపీ హయాంలో 2022వైసీపీ హయాంలో
సన్ ఫ్లవర్ నూనె 86 145
వేరు శెనగ నూనె 106 163
కందిపప్పు 74 170
పెసర పప్పు 75 140
వేరుశనగ పప్పు 80 160
చింతపండు 122 310
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వస్తువు రేటు పెంచేశారు. మినపప్పు ఆనాడు రూ.68 రూపాయలు మాత్రమే ఉంటే ఈనాడు రూ. 160లు పెట్టినా దొరకని పరిస్థితి. నాడు పంచదార రూ.35లుంటే నేడు రూ.46 నుంచి రూ.60వరకు పలుకుతోంది. చంద్రబాబు వంటగ్యాస్ సిలిండర్ రూ. 480 కే అందిస్తే ఈనాడు రూ.980కి చేరింది. ఇవన్నీ ఒకెత్తు అయితే ప్రభుత్వం నిర్వహించే ఫైబర్ నెట్ కనెక్షన్ ధరలు కూడా పెంచారు. ఆనాడు చంద్రబాబునాయుడు ఇంటర్నెట్ , టెలిఫోన్, కేబుల్ కనెక్షన్ మూడుకలిపి రూ.149లకే అందిస్తే, నేడు అవే కనెక్షన్లకు తుగ్లక్ ముఖ్యమంత్రి రూ.350లకు పెంచాడు.
అలానే ఇసుకను ఆనాడు చంద్రబాబునాయుడు ప్రజలకు ఉచితంగానే అందించారు. ఈరోజు లారీ ఇసుక ధర రూ.50వేలకు చేరింది. ఇదేనా మీ పరిపాలన అని ప్రశ్నిస్తున్నాం. సంక్షేమపథకాల మాటున మోసకారీ సంక్షేమాన్ని అమలుచేస్తూ, ఈ తుగ్లక్ సీఎం ఒక్కో కుటుంబంపై 2.50లక్షలవరకు అప్పులభారాన్ని
మోపాడు. పేదలపక్షాన తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తప్పా సమాధానం చెప్పడంలేదు. ప్రజలనుంచి దోచుకుంటున్నది కొండంత, వారికి ఇస్తున్నది మాత్రం పిసరంత.
అమ్మఒడి పేరుతో ప్రతితల్లికి ఏడాదికి రూ.14వేలుఇస్తూ, తండ్రి బుడ్డి పేరుతో ఏడాదికి రూ.50వేల వరకు కాజేస్తున్నారు. చంద్రబాబు వాహనమిత్ర పథకం ఆటో డ్రైవర్లను ఓనర్లు చేస్తే జగన్ ప్రభుత్వం రూ. 10 వేల పథకం మాటున రూ. 30 వేలు వసూలు చేస్తోంది. రెండున్నరేళ్లుగా సిమెంటు రేట్ల పెంచుకుంటూ పోతున్నారు. దీంతో 40 లక్షల భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. వైసీపీ పాలనలో 120 రకాల వృత్తులు చేసుకునే వారి పొట్ట కొట్టారు. చంద్రబాబు గారిని స్పూర్తిగా తీసుకుని సంక్రాంతి కానుకలు, అన్నా క్యాంటీన్లను తమిళనాడులో అమలు చేస్తుంటే ఇక్కడ మాత్రం జగన్ రెడ్డి పేదలను దోచుకుతింటున్నాడు.
విద్యుత్, ఆర్టీసీ, ఇసుక, సిమెంట్ చార్జీలు పెంపు, పన్నుల భారంతో ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారు, పేదలు కడుపునిండా తిండి తినడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. స్వయంగా ఓ మంత్రే రేషన్ వ్యాన్ లో మామూళ్లు వేయమని డబ్బా పెట్టారంటేనే మీరెంతలా దిగజారారో అర్ధమవుతోంది. తుగ్లక్ పాలనతో ప్రజలు విసిగిపోయారు. ఈ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పలికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.