ఏపీలో తాలిబన్ల పాలన

Spread the love

– వైసీపీ ఒక ఉగ్రవాద పార్టీ
– బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి

కర్నూలు: రని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఘర్షణ వెనుక ఉన్న కుట్ర కోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఇంకా విష్ణువర్దన్‌రెడ్డి ఏం మాట్లాడారంటే… వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చారు. ఆంధ్ర తాలిబాన్లుగా పాలిస్తున్నారు. వైసీపీ ఓక ఉగ్రవాద పార్టీ. వైసీపీ లో శిక్షణ పొందిన తాలిబన్లు తయారయ్యారు. ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం ల రూపంలో పాలిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటు. ఆత్మకూరు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తోడయ్యారు. ఆత్మకూరు ఘటన రెండు వర్గాల మధ్య జరిగింది కాదు. వైసీపీ, బీజేపీ మధ్య జరిగిన సంఘటన. వైసీపీ నేతలను కేసు నుంచి తప్పించేందుకు మత ఘర్షణలుగా చిత్రీకరిస్తున్నారు.ఎస్ డీఎఫ్ రూపంలో ఉగ్రవాదమూకలు పని చేస్తున్నాయి.

సీఎం జగన్, హోం మంత్రి సుచరిత సమాధానం చెప్పాలి. శిక్షణ పొందిన కొంతమందిని అరెస్ట్ చేశామని ఎస్పీ మీడియాకు చెప్పారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఉగ్రవాద మూకలతో వైసీపీ ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్నారు.సీఎం జగన్, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి మధ్య జరిగిన చర్చలు బయటపెట్టాలి.వైసీపీ కేంద్ర ఆఫీస్ సూచనలతో ఆత్మకూరులో దాడులు, పోలీస్ స్టేషన్ పై దాడి, వాహనాలు దగ్ధం చేశారు. ఆత్మకూరుకు వెళ్లకుండా టీడీపీ నేతలను అడ్డుకున్నవాళ్ళు డిప్యూటీ సీఎం అంజాద్ ఖాన్, హఫీజ్ ఖాన్ ను ఎందుకు పంపారు?

నిందితులను అరెస్ట్ చేయవద్దని డిప్యూటీ సీఎం సమక్షంలో శిల్పా చక్రపాణి రెడ్డి ఎలా కోరతారు?ఆత్మకూరులో దాడి జరిగింది ఒక వ్యవస్థపైన….పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవడంపై సీఎం, హోం మినిస్టర్ మాట్లాడారా? డిప్యూటీ సీఎం అంజాద్ ఖాన్, శిల్పా చక్రపాణి రెడ్డి, హఫీజ్ ఖాన్ పై కేసు నమోదు చేయాలి.

గుంటూరు లో పోలీస్ స్టేషన్ పై దాడి చేస్తే వైసీపీ ప్రభుత్వం కేసులు ఎత్తి వేసింది. ఆత్మకూరులో కూడా కేసులు ఎత్తివేస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.ఐపిసి ని వైసీపీ గా మార్చేస్తారా? వైసీపీ పులులు ఢిల్లీలో పిల్లులు. వైసీపీ నేతలు అధికారదాహంతో రెచ్చిపోతున్నారు. ఆత్మకూరు ఘటనలో స్వేచ్ఛగా విచారణ జరపండి. ఐపీఎస్ అధికారులను కూడా అధికారపార్టీ నేతలు బెదిరిస్తున్నారుఆత్మకూరు ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. డీఎస్పీ పిలిస్తేనే బీజేపీ నేతలు వివాదాస్పద స్ధలం వద్దకు వెళ్లారు.

ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, హఫీజ్ ఖాన్, శిల్ప చక్రపాణి రెడ్డి పై కేసు చేయకుంటే చలో ఆత్మకూరు పిలుపునిస్తాం వైసీపీ కి అధికారం ఇదే తొలిసారి, చివరిసారి కూడా. ఆత్మకూరులో కుట్ర కోణం పై విచారణ జరపాలి. ప్రాణరక్షణ కోసం బుడ్డా శ్రీకాంత్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడని పోలీసులే చెప్పారు. బాధితుడైన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి పై హత్య కేసు ఎలా పెడతారు?

Leave a Reply