అయిదుగురు ఉంటారనడం
కొడాలి వాదమా..?
కొందరు తొందరపడకుండా
ముందరి కాళ్ళకు బంధమా??
ఒక్కరై పుట్టడం..
ఒక్కరై పోవడం..
దేవుని సూత్రం..
అందరూ ఒకేసారి పోవడం
జగనన్న తంత్రం!!
హనుమంతుడు అడుక్కుతింటుంటే
గరుత్మంతుడు గీరుకు
తిన్నాడట…
అప్పుల బాధల్లో..
కరెంటు కష్టాల్లో..
జీతాల గోలలో..
ధరల బెడదలో..
పన్నుల నొప్పిలో..
ఇంకా వదలని
కరోనా భయంలో..
ఈ మంత్రివర్గం గో”లేమి”టో?
– ఎలిశెట్టి సురేష్ కుమార్