దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది సీఈసీ. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్
ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు
ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు
ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు
తెలంగాణలోనూ మే 13న ఎన్నికలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక
జూన్ 4న ఓట్ల లెక్కింపు
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నటు పేర్కొంది. ఈ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించనుండగా, ఏపీలో ఎన్నికలు నాల్గో విడతలో నిర్వహించనున్నట్లు సీఈసీ తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో మే 13వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అదే సమయంలో జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంటుందని సీఈసీ తెలిపింది.