Suryaa.co.in

Andhra Pradesh

ఫ్లాష్..ఫ్లాష్..మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహారించుకున్నట్లు ప్రకరించింది. ఇదే విషయాన్ని రాజధాని కేసుల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ కూడా తెలియజేశారు. అటు ఏపీ కేబినేట్ భేటిలో కూడా వికేంద్రీకరణ, సీఅర్దీఏ రద్దు బిల్లులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించనున్నారు. అటు ప్రస్తుతం ఉన్న బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని.. కొన్ని మార్పులతో కొత్తగా మళ్లీ సభలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడుతుందనే చర్చ కూడా జరుగుతోంది.
దీంతో అమరావతి రైతులు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏపీలో మూడు రాజధానులు చేస్తామంటూ జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు అవడంతో దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు విచారణలో నేడు మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తరుపున అడ్వకేట్‌ జనరల్‌ వెల్లడించారు.

LEAVE A RESPONSE