Suryaa.co.in

Andhra Pradesh

ఆర్.బి.ఐ అప్పుల్లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్న ఏపీ

– నిన్నటి రూ.1500 కోట్ల అప్పుతో దేశంలోనే ఆర్.బి.ఐ అప్పుల్లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్న ఏపీ
– గతంలో మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఉన్న ఏపీ నేడు రూ.45,303 కోట్లు ఆర్.బి.ఐ అప్పులతో మహారాష్ట్రను అధిగమించి నంబర్ 1 గా నిలిచింది
– ఆల్ ఇండియా బెగ్గర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బురిడీ బుగ్గన అన్ని విధాల అర్హుడు
– టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

ఆర్.బి.ఐ నుంచి సేకరించిన అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1 గా నిలిచిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం తెలిపారు. నవంబర్ 29 న ఆర్.బి.ఐ విడుడల చేసిన రాష్ట్రాల సెక్యురిటీల ఆక్షన్ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1500 కోట్లు కొత్తగా అప్పు తీసుకోవడంతో మహారాష్ట్రను కూడా దాటిపోయి ఆర్.బి.ఐ అప్పుల్లో నంబర్ 1 గా` నిలిచిందని ఆయన దుయ్యబట్టారు. ఈ మేరకు పట్టాభిరాం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

2022-2023 ఆర్థిక సంవత్సరంలో 2022 ఏప్రిల్-1 నుండి నవంబర్-29 వరకు ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ.45,303 కోట్లు అప్పులు తీసుకుని ఏపీ మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
సెక్యురిటీల ఆక్షన్ల ద్వారా ఆర్.బి.ఐ నుంచి అత్యధిక అప్పులు తీసుకున్న మొదటి 15 రాష్ట్రాలు: క్ర.స రాష్ట్రం తీసుకున్న అప్పు (రూ.కోట్లలో)
1 ఆంధ్రప్రదేశ్ 45,303
2 మహారాష్ట్ర 45,000
3 తమిళనాడు 43,000
4 పశ్చిమబెంగాల్ 30,000
5 పంజాబ్ 29,055
6 హర్యానా 26,500
7 రాజస్థాన్ 25,500
8 తెలంగాణ 25,500
9 గుజరాత్ 24,000
10 బీహార్ 19,000
11 కర్నాటక 16,000
12 కేరళ 14,436
13 ఉత్తరప్రదేశ్ 14,000
14 అస్సాం 12,100
15 మధ్యప్రదేశ్ 12,000

ఆర్.బి.ఐ నుంచి ఏపీ చేసినంత అప్పు దేశంలో మరే రాష్ట్రం చేయలేదు. దేశంలోనే అత్యధిక స్తూల ఉత్పత్తి గల మహారాష్ట్ర కేవలం రూ.45 వేల కోట్లు ఆర్.బి.ఐ నుంచి అప్పు చేయగా ఏపీ మాత్రం రూ.45,303 కోట్లు చేసి ప్రధమ స్థానంలో నిలిచింది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు వారికున్నటువంటి అప్పుల పరిమితిలో ఇప్పటి వరకు కేవలం వరుసగా 59.3 మరియు 51.2 శాతం మాత్రమే వినియోగించుకోవడం జరిగింది.

మరో పొరుగు రాష్ట్రం కర్నాటక అయితే అత్యంత తక్కువగా వారికున్న అప్పుల పరిమితిలో కేవలం 20.9 శాతం మాత్రమే ఆర్.బి.ఐ నుంచి అప్పుల రూపంలో వినియోగించుకుంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం మొదటి ఎనిమిది నెలల్లోనే సంవత్సరం మొత్తానికి చేయాల్సిన అప్పును మించి పోయి 101.6 శాతం అప్పులు కేవలం ఒక్క ఆర్.బీ.ఐ నుండే చేశారు. ఎంతో వెనుకబడిన చత్తీస్ ఘడ్ రాష్ట్రం ఈ ఏడాది ఆర్.బి.ఐ నుండి ఒక్క రూపాయి కూడా అప్పు తేలేదు. మన ప్రక్కనే ఉన్న ఒరిస్సా సైతం ఆర్.బి.ఐ నుంచి నయాపైసా అప్పు చేయలేదు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర కూడా ఈ ఏడాది ఆర్.బి.ఐ నుంచి ఎటువంటి అప్పులు చేయలేదు.

నిత్యం అబద్దాలతో ప్రజలను ప్రక్కదారి పట్టించే ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ప్రజలకు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్ధిక అత్యయిక పరిస్థితి దాపురించేందుకు జగన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిలే కారణమని అన్నారు. ఢిల్లీ వీధుల్లో బొచ్చె పట్టుకుని తిరుగుతూ బిజీగా కనిపించే బురిడీ బుగ్గన ఆల్ ఇండియా బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేస్తే సముచితంగా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఈ అప్పులు మొత్తం భవిష్యత్తు తరాలపై పడి మోయలేని భారంగా మారబోతుందని హెచ్చరించారు.

LEAVE A RESPONSE