మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి

-మంత్రి ఎర్రబెల్లిని కలిసిన తెలంగాణ పంచాయతీ కార్యదర్శులు
-సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ
-విధి నిర్వహణలో గాయపడ్డ పంచాయతీ కార్యదర్శికి మెరుగైన వైద్యంఅందించాలని కలెక్టర్, -వైద్యులతో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

(హైదరాబాద్, నవంబర్ 30): గత మూడున్నరేళ్లుగా పనిచేస్తున్న తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల(టిపిఎస్ఎఫ్) ఫెడరేషన్ అధ్యక్షులు గౌరినేని రాజేశ్వర్ రావు నేతృత్వంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని హైదరాబాద్ లో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అవిరామంగా పనిచేస్తున్నారని, వారి సేవలను గుర్తించి, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులరైజ్ చేయాలని మంత్రిని కోరారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విజ్ణప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నేరెడుగొండు మండలం, పీచర గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శి రాజ్ కుమార్ ఆర్.ఓ.ఎఫ్.ఆర్ సర్వేలో భాగంగా విధులు నిర్వహించి ఇంటికి వస్తుండగా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే రాజ్ కుమార్ కు మెరుగైన వైద్య అందించాలని జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు.

అనంతరం రాజ్ కుమార్ చేరిన హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులతో మాట్లాడారు. రాజ్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.

మంత్రిని కలిసిన వారిలో సంఘం కోశాధికారి శశిధర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ఆకారపు సురేశ్, జాయింట్ సెక్రటరీ ప్రవీణ్, జనగామా జిల్లా అధ్యక్షులు గర్వందుల శ్రీకాంత్ గౌడ్, సంఘం ప్రతినిధులు లక్ష్మీనారాయణ, పృథ్వి, శివ, భాస్కర్, పాషా, వినయ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply