ఒక డాక్టర్ కూడా ఉంటుంది నీరాలో

నీ ఆరోగ్యం కోసం
నీరా ఒక ఔషధం అవుతుంది
కాసేపు నీ బాధలో లీనమైన
ఒక డాక్టర్ కూడా ఉంటుంది నీరాలో

నీరాకు తెలుసు
నీవు బాగా ఇబ్బంది పడే వుంటావు
జీవితంలో..
నీవొచ్చి రాగానే
నీ కళ్ళను, ముఖ కవళికల్నీ
మొత్తంగా నీ ఆరోగ్యాన్ని
ఒక పుస్తకంలా చదివేస్తుందిలే

శరీరంలో అవయవాలపై
పేరుకు పోయిన
రోగాల తుడిచే
మూళికల పసరు కూడా
వుంటుంది నీరాలో

అయితే చాలా మంది
వారి లోపల రోగాలతో బాదపడుతూ
ఏగలేక నీలాగే దేహం శుద్ధి కొరకు
నీరా సేవించే కొంత సమయం నిరీక్షించే
డాక్టర్ తగ్గించలేని వైద్యం
సర్వరోగ నివారణి నీరాను
ఎప్పుడో ఒకసారి సేవించక తప్పదు
ఏం పర్లేదు
ఓపిక ఉంటే నీరాలో
అనేక రకాలైన మధుర రుచులు
మైమరిపించే ప్రశాంతతలు వున్నాయి.

తాగే కాసేపు
అన్ని మరిచిపోయి
ప్రాణమే ముఖ్యమనిపించొచ్చు
మరి తొందరగా వచ్చేయ్
నీరా కొరకు

నీరా నిన్నెప్పుడూ స్వాగతిస్తుంది
నీ ఆరోగ్యం కోసం
దీనికి పేద ధనిక అనే తేడాలు
ఏమీ వుండవు
అచ్చంగా రోగాలతో
కొట్టుమిట్టాడుతున్న శరీరాలే కావాలి.

– ఈత ముల్లు.!

Leave a Reply