Suryaa.co.in

Andhra Pradesh

పీల్చే గాలికి కూడా జగన్ రెడ్డి పన్ను వేసేలా ఉన్నాడు

• జగన్ రెడ్డి పాలన తాలిబన్ల పాలనను మించిపోయింది
– జగన్ చేతకాని తనం వల్ల ఏపీకి పెట్టుబడులు రావడం లేదు
– బాబు పాలనలో ఏనాడూ ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు. కరెంటు ఛార్జీలు పెంచలేదు
• జగన్ రెడ్డి పాలనలో ఆర్టీసీ ఛార్జీలు 3సార్లు, కరెంటు ఛార్జీలు 7సార్లు పెంచాడు
– తంబళ్లపల్లి నియోజకవర్గం, మద్దయ్యప్పగారిపల్లిలో మహిళలతో యువనేత నారా లోకేష్ ముఖాముఖి

యువనేతతో మహిళలు మాట్లాడుతూ…
• సర్పాజ్,తంబళ్లపల్లి: నా భర్తను పోలీసులు అరెస్టు చేసి కొట్టడం వల్ల ఆయన వికలాంగుడు అయ్యాడు. అతన్ని రుయాలో చూపించుకుంటున్నాను. సరైన వైద్యం అందడం లేదు. నా భర్త కాలు తీసేయాలని వైద్యులు చెబుతున్నారు. నా కుటుంబాన్ని పోషించేవారు లేరు. నా కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది. వైసీపీ పాలనలో మేం రోడ్డున పడ్డాం. మీరే మమ్మల్ని ఆదుకోవాలి.
• సిద్దమ్మ,కోసువారిపల్లి: పంచాయతీ ఎన్నికలు జరిగిన నాటి నుండి నన్ను డ్వాక్రా బుక్ కీపర్ గా వైసీపీ నాయకులు తొలగించారు. డ్వాక్రా సభ్యులంతా నేనే కావాలని కోరి సంతాకాలు పెట్టినా నాకు ఉద్యోగం లేకుండా చేసి వేధిస్తున్నారు.
• నారాయణమ్మ,గట్టు గ్రామం: నా వయస్సు 70సంవత్సరాలు. నన్ను చూసేందుకు ఎవరూ లేరు. ప్రభుత్వం కనీసం పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. మీరే నన్ను ఆదుకోవాలి.
• అర్చన,గుర్రంకొండ: రోజుకు 30-40 కిలోమీటర్లు ప్రయాణం చేసి కాలేజీలకు వెళుతున్నాం. చదువుకున్నవాళ్లం నిరుద్యోగులుగా మిగిలిపోతున్నాం. మాకు ఉద్యోగాలు ఇచ్చే విషయమై మీరైనా చర్యలు తీసుకోండి.
• దీపిక,రెడ్డికోట: మేం డిగ్రీ చదువుతున్నాం. మా చదువులు పూర్తయ్యాక మాకు ఉద్యోగాలు వస్తాయా?
• లక్ష్మి,గట్టుగ్రామం: డిగ్రీ చదివే విద్యార్థులకు అందుబాటులో కాలేజీలు లేవు, హాస్టళ్లు లేవు. వాటిని ఏర్పాటు చేయాలి. వైసీపీ పాలనలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టే చర్యలను మీరు అధికారంలోకి వచ్చాక తీసుకోవాలి.
• కూసాలపల్లి గ్రామం: 25ఏళ్లుగా మేం అభయహస్తం కట్టాం. మాకు 60సంవత్సరాలు దాటినా మేం కట్టిన ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. మా డబ్బులను ప్రభుత్వం దోచుకుంది. మా డబ్బులు మాకు ఇప్పించండి బాబు.
• కోసువారిపల్లి గ్రామం: నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ నాకు మెంటల్ అని తంబళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో వైసీపీ నాయకులు రాయించారు. నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పిచ్చిపిచ్చిగా పెంచిన వైసీపీ నాయకులకు పిచ్చిపట్టిందా? ప్రశ్నించే నాకు పిచ్చిపట్టిందా? అనే అనుమానం ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక మహిళలకు న్యాయం చేయాలి.
• ఉమాదేవి,ముతకపల్లి ఎంపీటీసీ: 25ఏళ్లుగా మాకు రేషన్ షాపు ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేశారు. నా భర్త కాంట్రాక్టు పనులు చేస్తే బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారు.
• సునీత, కోసువారిపాలెం: పీపీహెచ్చ పైపును రూ.200 నుండి రూ.900కి పెంచేశారు. డ్రిప్ ఇరిగేషన్ నిలిపేశారు. పొలం మొత్తానికి కాకుండా సగం డ్రిప్ మాత్రమే ఇస్తామని వైసీపీ నాయకులు, అధికారులు చెబుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకోవాలి.
• రాణి,తంబళ్లపల్లి:నేను టైలరింగ్ చేస్తున్నాను. చాలా మంది టైలరింగ్ నేర్చుకున్నారు. కానీ వారికి కుట్టు మిషన్ కొనుక్కునే స్థోమత లేక ఖాళీగా ఉన్నారు. మీరు మిషన్లు ఇచ్చి మహిళలకు స్వయం ఉపాధి అందించే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
• గంగాదేవి,ములకలచెరువు: నా తండ్రి పంచాయతీలో సుదీర్ఘ కాలం పనిచేశాడు. కొంతకాలం క్రితం చనిపోయాడు. ఆ ఉద్యోగంలో నా తమ్ముడు పనిచేస్తున్నాడు. నా తమ్ముడిని అకారణంగా వైసీపీ నాయకులు తొలగించారు. మీరే మా కుటుంబాన్ని ఆదుకోవాలి.

యువనేత లోకేష్ మాట్లాడుతూ…
• వైసీపీ పాలనలో ధరలు ఆకాశాన్నంటాయి.
• జగన్ రెడ్డి నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ఇంటిపన్ను, చెత్తపన్నుతో సామాన్యుల నడ్డి విరుస్తున్నాడు.
• రానున్న కాలంలో పీల్చే గాలికి కూడా జగన్ రెడ్డి పన్ను వేసేలా ప్రవర్తిస్తున్నాడు.
• జగన్ రెడ్డి పాలన తాలిబన్ల పాలనను మించిపోయింది.
• వైసీపీ నాయకులు అమాయకులను టార్గెట్ చేసి వేధిస్తున్నారు.
• జగన్ రెడ్డి కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్…
• ఇప్పటికే 6లక్షల పెన్షన్లను వివిధ కారణాలు చూపి జగన్ సర్కార్ కట్ చేసింది.
• చంద్రబాబు పాలనలో పెన్షన్ ను రూ.200 నుండి రూ.2,000లకు పెంచారు.
• పెన్షన్ పెంపు పై చంద్రబాబు 2014ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా పెంచారు.
• జగన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు పెన్షన్ ను రూ.3వేలకు పెంచుతానని హామీ ఇచ్చి ఇప్పటికి 4దశల్లో కేవలం రూ.750మాత్రమే పెంచాడు.
• జగన్ రెడ్డి పాలనలో అన్యాయంగా పెన్షన్ కోల్పోయిన ప్రతి ఒక్కరికీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే పెన్షన్లు ఇస్తాం. ఎవరూ అధైర్య పడొద్దు.
• ఉద్యోగాల భర్తీ విషయంలో జగన్ రెడ్డి సర్కార్ విఫలమైంది.
• అధికారంలోకి వస్తే 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చాడు.
• ప్రతియేటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు.
• అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు అడిగిన యువకులను అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నాడు.
• చంద్రబాబు సీఎంగా ఉండగా 32వేల ప్రభుత్వ ఉద్యోగాలను డీఎస్సీ ద్వారా భర్తీ చేశారు.
• టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ప్రభుత్వ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. ఇది నా హామీ.
• మొదటి జాబ్ క్యాలెండర్ 2025 జనవరిలో ఇస్తున్నాం.
• చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రైవేటు రంగంలో 40వేల పరిశ్రమలు తెచ్చి సుమారు 5.30లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఈ విషయాన్ని వైసీపీ అసెంబ్లీలో ఒప్పుకుంది.
• చంద్రబాబు పాలనలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని గూగుల్ లో వెతికితే ఏపీ అని సమాధానం వచ్చేది.
• జగన్ రెడ్డి పాలనలో గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా ని వెతికితే ఏపీ పేరు చూపిస్తోంది.
• జగన్ చేతకాని తనం వల్ల ఏపీకి పెట్టుబడులు రావడం లేదు. ఫలితంగా యువతకు ఉద్యోగాలు లేవు.
• విశాఖలో ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ ఓ ఫేక్ సమ్మిట్.
• 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మన రాష్ట్రం యువత పక్క రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెళ్లకుండా చూస్తాం. పక్క రాష్ట్రం వాళ్లే మన రాష్ట్రానికి ఉద్యోగాల కోసం వచ్చేలా పెట్టుబడులు తెచ్చి, ఉద్యోగాలు సృష్టిస్తాం.
• జగన్ పాలనలో స్వయం ఉపాధిని పూర్తిగా చంపేశారు.
• కార్పొరేషన్ల ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మొత్తం నిలిపేశారు.
• ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రిని ఉద్యోగాలు అడిగితే కోడి, గుడ్డు అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. యువతను గందరగోళంలోకి నెడుతున్నాడు.
• జగన్ రెడ్డి మరోసారి సీఎం అయితే ఐటీ చదువుకున్నవాళ్లంతా ఉపాధి కూలీల మాదిరి రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి.
• టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తాం.
• వైసీపీ పాలనలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది.
• జగన్ రెడ్డి పాలనలో 900మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ఒక్కరికి కూడా దిశచట్టం ప్రకారం శిక్షలు పడలేదు.
• కానీ దిశచట్టం, యాప్ అంటూ జగన్ సర్కార్ ప్రచారం ఊదరగొడుతోంది.
• హజీరాబీ, మిస్బ వంటి మైనారిటీ యువతులు వైసీపీ నాయకుల వేధింపులు, ఆగడాలకు బలయ్యారు.
• సీఎం ఇంటి సమీపంలోనే రాణి అనే అంధ యువతిని రాజు అనే యువకుడు గంజాయి మత్తులో దారుణంగా చంపేశాడు.
• జగన్ పాలనలో ఒక్క హామీ కూడా మహిళలకు నెరవేర్చలేదు.
• ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి అమ్మఒడి ఇస్తామని మాట ఇచ్చి, ఒక్కరికే అమలు చేస్తున్నాడు.
• సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పిన జగన్ రెడ్డి, రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నా నోరు మెదపడం లేదు.
• మహిళలను వంచించిన నయవంచకుడు జగన్మోహన్ రెడ్డి.
• నా తల్లి ఓ సీఎం కి కూతురు, మరో సీఎంకు భార్య. నా తల్లికి రాజకీయాలు అంటే పడవు. అందుకే ఆమె ఏనాడూ బయటకు రాదు.
• నా తల్లిని జగన్ రెడ్డి, తన గ్యాంగ్ అసెంబ్లీ వేదికగా అవమానిస్తే..నా తల్లి కోలుకునేందుకు నెలరోజులు పైనే పట్టింది.
• నా తల్లిని అవమానించిన శాసనసభ్యులను ముఖ్యమంత్రి జగన్ కనీసం మందలించలేదు. క్షమాపణలు చెప్పించలేదు.
• వైసీపీ మహిళా శాసనసభ్యురాలు, మంత్రి రోజాకే మహిళలంటే గౌరవం లేదు. ముఖ్యమంత్రితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం మహిళలంటే గౌరవం లేదు.
• ఏపీలో గత మూడేళ్లలో 52వేల మంది మహిళలపై దాడులు జరిగాయని కేంద్రం నివేదికలు చెబుతున్నాయి.
• చంద్రబాబు పాలన భద్రతకు నిదర్శనం..జగన్ రెడ్డి పాలన అఘాయిత్యాలకు నిదర్శనం.
• జగన్ రెడ్డి అభయహస్తం డబ్బులు రూ.2,200కోట్లు దోచుకున్నాడు.
• చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ డబ్బులను రికవరీ చేసి, మీకు అందేలా చూస్తాం.
• మద్యంపై జగన్ రెడ్డి రూ.25వేల కోట్లు అప్పులు చేశాడు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత నీచానికి పాల్పడలేదు.
• చంద్రబాబు పాలనలో 130 సంక్షేమ కార్యక్రమాలను పేదవారికోసం అమలు చేశారు.
• ఒక్క ఛాన్స్ అని అడిగిన వాడిని నమ్మారు…అతను అధికారంలోకి వచ్చాక 100సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు.
• చంద్రబాబు పాలనలో ఏనాడూ ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు. కరెంటు ఛార్జీలు పెంచలేదు.
• జగన్ రెడ్డి పాలనలో ఆర్టీసీ ఛార్జీలు 3సార్లు, కరెంటు ఛార్జీలు 7సార్లు పెంచాడు.
• ఇదేంటని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
• 2019కి ముందు నాపై ఒక్క కేసు కూడా లేదు. జగన్ సీఎం అయ్యాక నాపై ఇప్పటికి 20కేసులు పెట్టారు. నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు. భయం నా బయోడేటాలో లేదు.
• పులివెందులలో నాగమ్మ అనే దళిత మహిళను మానభంగం చేసి, చంపేస్తే..ఆ కుటుంబాన్ని టీడీపీ దళిత నాయకులు వంగలపూడి అనిత, ఎం.ఎస్.రాజు వెళితే పోలీసులు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ విధంగా అన్యాయంగా వైసీపీ పాలన జరుగుతోంది.
• పేదవాడికి పట్టెడన్నం మూడు పూటలా పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లు పెడితే వాటిని కూడా జగన్ రెడ్డి మూసేశాడు.
• టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లను అన్నింటినీ పేదవాళ్లకు అందుబాటులోకి తెస్తాం.
• టీడీపీ కి చెందిన వారిని వేధించిన వైసీపీ వారిపై 2024లో అధికారంలోకి వచ్చాక తగిన చర్యలు తీసుకుంటాం.
• వైసీపీ రద్దు చేసిన రేషన్ దుకాణాలను గతంలో నిర్వహించిన వారికే ఇస్తాం. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది.
• చంద్రబాబు పాలనలో 90శాతం సబ్సిడీపై డ్రిప్ ఇచ్చారు. రైతులను ఆదుకున్నారు.
• జగన్ సీఎం అయ్యాక డ్రిప్ ను పూర్తిగా రద్దు చేసి రైతులను నాశనం చేస్తున్నాడు. రైతులేని రాజ్యంగా ఏపీని చేస్తున్నాడు.
• మోటార్లకు మీటర్ల పేరుతో జగన్ రెడ్డి రైతు మెడకు ఉరితాళ్లు బిగించాలని చూస్తున్నాడు. రైతులెవరూ ఆ మీటర్లను అంగీకరిస్తూ సంతకాలు పెట్టొద్దు. ఎదురు తిరగండి. మీకు మేం అండగా నిలబడతాం.
• 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతులకు గతంలో అమలు చేసిన పథకాలన్నీ అమలు చేస్తాం.
• రైతు పండించిన పంటలకు గిట్టుబటు ధరలను అందిస్తాం.
• మహిళలకు స్వయం ఉపాధికి చంద్రబాబు పెద్దపీఠ వేశారు. గతంలో కుట్టు మిషన్లను కూడా అందించారు.
• టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్వయం ఉపాధి కార్యక్రమాలతో పాటు, కొన్ని కంపెనీల్లో మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.
• జగన్ రెడ్డి కక్షసాధింపు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్.
• టీడీపీ కి చెందిన మహిళలు, వారి కుటుంబాలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోంది.
• తంబళ్లపల్లిలో తాలిబన్ తరహా పాలన జరుగుతోంది.
• టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలను ఆదుకుంటాం. వారి సంక్షేమానికి పెద్దపీఠ వేస్తాం.
• చంద్రబాబు సీఎం అయ్యాక పన్నులను తగ్గించి, నిత్యావసరాల ధరలను తగ్గిస్తాం.
• కేరళ రాష్ట్రం మాదిరి రూ.2వేల కోట్లతో నిత్యావసరాల ధరల తగ్గింపుకు చర్యలు తీసుకుంటాం.
• జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు బాధలు పెరిగాయి…
• మీ బాధలు పోవాలంటే…చంద్రబాబు సీఎం కావాలి.

LEAVE A RESPONSE