జగన్ పాలనలో సీమకు జరిగిన అన్యాయం గత ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు

-జగన్ రెడ్డి సీఎం అయ్యాక సీమకు ఒక్క పరిశ్రమైనా తెచ్చారా?
-సీమ నేలపై కృష్ణా జలాలు పారించిన ఘనత ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడులదే
-విశాఖ పాలనా రాజధానిగా సీమ వాసులెవరూ కోరుకోవటం లేదు
-వైసీపీ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు 3 రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు
-వైసీపీ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయం రాష్ట్రం ఏర్పడిప్పటి నుంచి గత ఏ ప్రభుత్వంలోనూ జరగలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ద్వజమెత్తారు. బుధవారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….జగన్ రెడ్డి ముఖ్యమంత్రాయ్య రాయలసీమ అభివృద్ది ఆగిపోయింది. సాగునీటి ప్రాజెక్టులు నిలిపేశారు, రైతులకు యంత్ర పరికరాలు, డ్రిప్ అందటం లేదు. రాయలసీమ పట్ల జగన్ రెడ్డి వివక్ష, విద్వేషభావం స్పష్టంగా అర్దమవుతోంది.

టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో అంతర్జాతీయ కియా పరిశ్రమ తెచ్చారు. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నీరివ్వబట్టే కియా వచ్చింది. చిత్తూరు జిల్లాలో హీరో మోటార్స్, సెల్ కాన్ వంటి కంపెనీలు తెచ్చాం. సెంట్రల్ వర్సిటి, ట్రిబుల్ ఐటి, ఐషర్ వంటి జాతీయ విద్యా సంస్ధలు సీమలో ఏర్పాటు చేశాం. కానీ జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాయలసీమకు ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా?

రాయలసీమ వెనుకబాటు తనాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకోవటంలో రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డిల్ని మించినవారు లేరు. రాయలసీమకు కృష్ణా నికర జలాలు కావాలని రాని నీటి కోసం రాజశేఖర్ రెడ్డి ఉద్యమం చేస్తే ఎన్టీఆర్ రాయలసీమను ఆదుకోవాలని హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టుకుల రూపకల్పన చేశారు. అవే నేడు రాయలసీమకు వరాలుగా మారాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలుగుగంగ ద్వారా రాయలసీమ నేలపై కృష్ణా జలాలు పారించిన ఘనత నాడు ఎన్టీఆర్ ది, నేడు చంద్రబాబు నాయుడిది. టీడీపీ హయాంలో హంద్రీనీవా కోసం రూ. 4 వేల కోట్లు ఖర్చు చేశాం, హంద్రీనీవాలో అంతర్బాగంగా మారాల, జీడిపల్లి, బ్రాహ్మణ పల్లి రిజర్వాయర్లు పూర్తి చేశాం.

అనంతపురం జిల్లాలో బైరవానితిప్ప ప్రాజెక్టు, ఉరవకొండ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు నీరిచ్చే బిందు సేద్యం పనులు ప్రారంభించాం. కానీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రాయ్యక ఆగిపోయిన పనులు నేటికి ప్రారంభం కాలేదు. ఇది రాయలసీమకు ద్రోహం చేయటం కాదా? కొత్త ప్రాజెక్టులు కట్టకుండా, ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా రాయలసీమకు మీరు చేసే మేలేంటో వైసీపీ సమాధానం చెప్పాలి. మూడు రాజధానుల పేరుతో ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం దుర్మార్గం. విశాఖ వాసులు ఎవరూ పాలనా రాజధాని కోరుకోవటం లేదు, విశాఖలో రాజధాని పెడితే రాయలసీమకు దూరమవుతుంది. న్యాయరాజధాని ముసుగులో అసలు రాజధానిని రాయలసీమకు దూరం చేసే హక్కు జగన్ రెడ్డికి ఎవరిచ్చారు?

3 రాజధానులపై రాయలసీమలో ప్రజాభిప్రాయం నిర్వహించే దమ్ము వైసీపీకి ఉందా? విశాఖలో పాలన రాజధాని అంటే ఏ రాయలసీమ వాసైనా ఒప్పుకుంటారా? హైదరాబాద్, బెంగుళూరు లో ఉన్న తన ఆస్తుల్ని కాపాడుకోవటాని జగన్ రెడ్డి తప్ప ఏ రాయలసీమ వాసి ఒప్పుకోరు. మూడున్నరేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ది లేదు, యువతకు ఉపాధి, ఉద్యోగం, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, సబ్సీడీ విత్తనాలు లేవు, జగన రెడ్డి సీఎం అయ్యాక సీమ ప్రధాన వాణిజ్య పంట వేరు శనగ ఏడాదికి లక్ష ఎకరాల విస్తీర్ణం తగ్గుతోంది.

రాయలసీమ వాసిగా జగన్ రెడ్డి చేసేందేంటి? అడుగడుగునా సీమకు అన్యాయం చేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం దుర్మార్గం. చంద్రబాబు నాయుడు కూడా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతిలో భూమన ర్యాలీలు చేస్తే హైకోర్టు రాదు, వైసీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే వస్తుంది. హోదా సాధిస్తారని, బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ తెస్తారని జగన్ రెడ్డిని ప్రజలు గెలిపించారు. కానీ జగన్ రెడ్డి రాయలసీమకు ద్రోహం చేస్తూ ప్రజల్ని మోసగిస్తున్నారు. పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లొంగి మోటార్లకు మీటర్లు పెట్టబోమని చెబుతుంటే జగన్ రెడ్డి సిగ్గులేకుండా రాష్ట్రంలో ఉన్న 17 లక్షల 54 వేల మోటార్లకు మీటర్లు పెడతామంటున్నారు. వాటిలో 9 లక్షల మీటర్లు సీమలోనే ఉన్నాయి.

సీమలో బోర్ల సాగువల్లే రైతులు జీవిస్తున్నారు. జగన్ రెడ్డికి వాళ్ల గొంతు కోయడానికి మనసెలా ఒప్పింది? వైసీపీ ఆర్దిక సహకారంతో జరుగుతున్న కృత్రిమ ఉద్యమాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సొంత జిల్లాలో ఉక్కు పరిశ్రమ పెట్టలేని వ్యక్తి మిగతా జిల్లాలో ఏం పరిశ్రమలు పెడతారు. పులివెందులలో బస్టాండ్ కట్టలేని వ్యక్తి రాయలసీమను ఏం బాగుచేస్తారు? జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ రెడ్డి తన అసమర్దతను కప్పి పుచ్చుకునేందుకు కృత్రిమ ఉద్యమాలకు కుట్రలు చేస్తున్నారు.

దీనిపై సీమ వాసుల్ని జాగృతం చేస్తాం. అందుకు కలిసి వచ్చే వారిని కలుపుకెళ్లి వైసీపీ దుర్మార్గాలపై పోరాడుతాం. సీమ ప్రజల ఆకాంక్షల కోసం, హక్కుల కోసం టీడీపీ రాజీలేనిపోరాటం సాగిస్తుందని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు.