సుజనాకు మద్దతు
విజయవాడ : పెన్షనర్లను మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఓడించాలంటూ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం అమరావతి విభాగం ఓటర్లకు పిలుపు ఇచ్చింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనాకు మద్దతు ప్రకటించింది. ఎన్డీఏ అభ్యర్థులకు ఓటేయాలంటూ కరపత్రాలను సుజనా చౌదరి ద్వారా విడుదల చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పెన్షనర్ల సంఘం తమ కరపత్రాల్లో విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు 30వేల కోట్ల రూపాయలని సంఘం వివరించింది.
జగన్ ప్రభుత్వ విధానాలతో అందరి బతుకులు రోడ్డునపడ్డాయని సంఘం నేతలు దుయ్యబట్టారు. సుజనాను కలిసినవారిలో ఏపీ సచివాలయం సంఘం మాజీ అధ్యక్షుడు గురవయ్య, ఏపీఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు-జేఏసీ మాజీ చైర్మన్, అఖిల భారత పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి జి.పూర్ణచంద్రరావు, సంఘం నేతలు విజ్ డం చౌదరి, పి.నాగరాజు, ఆచంట రామారాయుడు, డి.క్రిస్టోఫర్, ఆర్. రామమూర్తి నాయుడు, వి.కృష్ణమనాయుడు, పి.పిచ్చయ్య, సీహెచ్ సుభాష్ చంద్రబోస్, సీహెచ్ శ్రీనివాసరావు, టి.వెంకటనర్సయ్య, వై.దాసయ్య, పి.పద్మనాభం ఉన్నారు.