Suryaa.co.in

Andhra Pradesh

పొత్తును కోరుకుంటున్న ఏపీ ప్రజలు

– ప్రజల కోసం రాజకీయ నేతలు భేషజాలు వీడాలి
-వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
– లాయర్ ఆదినారాయణను అడిగినట్లే రేపు సామాన్యుడి ఇంట్లో 50 శాతం అడుగుతారేమో?
-ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతం ఇవ్వడం సర్కారు బాధ్యత
-వ్యవసాయ, అక్వా రంగం వంద శాతం పన్ను పెంపు
– మాజీ మంత్రి నారాయణ అరెస్టు అప్రజాస్వామికం
– రైతన్న నడ్డి విరుస్తున్న రైతు బాంధవుడు
– ఎంపీ రఘురామ కృష్ణంరాజు

రానున్న ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షాల మధ్య పొత్తు ను కోరుకుంటున్నారని, నాయకులు భేషజాలు పక్కకు పెట్టీ ప్రజలను గెలిపించేందుకు సిద్ధం కావాలని నరసాపురం ఎంపీ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు అన్నారు. పొత్తు ఉండాలనేది ప్రజల కోరిక, పొత్తు లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి, ఇతర పార్టీల తరఫున బరిలోకి దిగే బలమైన అభ్యర్థిని గెలిపించడం ఖాయమని చెప్పారు.

మంగళవారం ఢిల్లీలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయమంతా పొత్తుల చుట్టూ తిరుగుతుందని, ప్రతిపక్షాల పార్టీలను పొత్తులు లేకుండా ఎన్నికలకు రావాలంటూ వైఎస్సార్ సీపీ నాయకులు, మంత్రులు సవాళ్లను విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు . రానున్న ఎన్నికల్లో టిడిపి , జనసేన పొత్తు పెట్టుకుంటే, తమ పునాదులు కదులుతాయని భయాందోళనలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లోనూ, మంత్రుల్లోను కనిపిస్తోందనీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకుంటే వై ఎస్ ఆర్ సి పి నేతలు, మంత్రులకు ఎందుకంత బేలతనం ఆడతన మని ప్రజలు మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఎక్కడ కలుస్తాయో నన్న భయాన్ని, కోపాన్ని తిట్ల రూపంలో మంత్రులు చూపిస్తున్నారని అన్నారు. పొత్తులపై టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ లు ఇంకా స్పష్టత ను ఇవ్వలేదని, అయినా ప్రజల కోసం త్యాగం చేయడానికి సిద్ధమని చంద్రబాబు అంటే, తాను ఎవరి పల్లకీ మోయనని, ప్రజల పల్లకీ మొస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొంటున్నారని గుర్తు చేశారు.

దీనితో ఈ రెండు పార్టీలు ఎక్కడ కలుస్తాయోన ని, సింగిల్ గా పోటీ చేయాలంటూ తమ పార్టీ నేతలు, టిడిపి జనసేన పార్టీ లకు సవాళ్లు విసురుతున్నార న్నారు. వాళ్ళు ఎలా పోటీ చేయాలో, అడిగే హక్కు వైయస్సార్ పార్టీ నేతలకు, మంత్రులకు ఎక్కడిదన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నిన్న, మొన్నటి వరకు మగాడు …మగాడు అన్నారని, ఇప్పుడేమో మృగాడు అంటున్నారన్న ఆయన , మృగాడు అంటే సింహం అని అంటున్నారని ఎద్దేవా చేశారు. సింహం సింగిల్ వస్తుందని, రానున్న ఎన్నికల్లో 151 కాదు.. 175 స్థానాలు గెలుస్తామని చెబుతున్నారని, 175 స్థానాలు గెలిచిన వారికి ఎందుకీ బేలతనం రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

ఒకటో తేదీ జీతాలు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీ జీతాలు చెల్లించడం ప్రభుత్వ బాధ్యతని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఒకటవ తేదీన జీతాలు ఇవ్వకపోతే ఆ ప్రభుత్వం ఉన్నా లేనట్లేనని చెప్పు కొచ్చారు. నిన్న మొన్నటి వరకు రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ వస్తాయో రావొనని ఆందోళన చెందుతూ ఉండగా, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు తమకు జీతాలు ఎప్పుడు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారన్నారు.

ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆందోళనకు దిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, త్వరలోనే మిగతా శాఖల ఉద్యోగులు కూడా విద్యుత్ ఉద్యోగుల బాట పట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల తో కలుపుకొని రాష్ట్రంలో 40 లక్షల మంది ఉద్యోగులు ఉంటే గతంలో 30 లక్షల మంది తమ పార్టీకి ఓటు వేశారని, ఇప్పుడు వారెవ్వరు ఓటు వేసే అవకాశం లేదన్నారు.. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పి, పర్మినెంట్ ఇచ్చేసింది లేదన్న ఆయన, ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు.

ఉద్యోగులకు జీతాలు ఇచ్చే నాడు బటన్ నొక్కుడు కార్యక్రమం ఏర్పాటు చేసి సాక్షి దినపత్రికలో పెద్ద ఎత్తున ప్రకటనలిచ్చే అవకాశం లేకపోలేదని ఎద్దేవా చేశారు. ఒకవైపు జీతాలు అందక ఉద్యోగులు అయోమయంలో ఉంటే, రాష్ట్రంలో 40 శాతం విద్యుత్ చార్జీలను పెంచి వసూలు చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఏ ఒక్కరు తమ పార్టీకి అవకాశం లేదన్నారు.

166 కిమీ 6220 గుంతలు
ఏపీలో 160 కిలోమీటర్ల రోడ్లను పరిశీలిస్తే, 6220 గుంతలు ఉన్నట్లు గణాంకాలు చెప్తుంటే, మంత్రులు మాత్రం అసలు కొలతలు లేవని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు గుంత లే కాదు… రోడ్లు లేవని ఉంటే బాగుండేదని ఆయన చమత్కరించారు. విజయవాడ ఆటో నగర్ లోని సీనియర్ న్యాయవాది ఆదినారాయణ ఆస్తుల పై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు, అందులో తమకు 50 శాతం అప్పగించాలని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.

ఈ విషయమే ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే, రేపు సామాన్యుని సైతం మీ ఇంట్లో 50 శాతం వాటా కావాలని అడిగే అవకాశాలు లేకపోలేదన్నారు. మన రాష్ట్రం మరో లంకగా, రావణకాష్టంగా ర గలకుండా ఉండాలంటే ప్రజలంతా ఏకమై ఈ అరాచకాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రైతు నడ్డి విరుస్తున్న స్వయం ప్రకటిత రైతు బాంధవుడు
వ్యవసాయ, ఆక్వా రంగాలపై 100 శాతం సెస్సు పెంచిన ఘనత స్వయం ప్రకటిత రైతు బాంధవుడు, దయార్ద్ర హృదయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. వ్యవసాయ, మార్కటింగ్ సెస్సు గతంలో ఒక్క శాతం ఉండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర శాతానికి పెంచారని తెలిపారు. రైతులను బాదుడే బాలుడు కార్యక్రమంలో భాగంగా 37 వేల కోట్ల రూపాయల ఎగుమతులున్న, ఆక్వా రంగంపై న కూడా 100 శాతం పన్ను పెంచారన్నారు. చేపలఎగుమతులపై 100 శాతం, రొయ్యల ఎగుమతుల పై 400 శాతం పన్ను పెంచడంతో, ఆక్వా రంగం కుదేలయ్యే పరిస్థితి నెలకొందన్నారు. నీటి పన్ను కూడా అడ్డగోలుగా పెంచడం వల్ల ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు , బిల్లులు కట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో వెయ్యి లీటర్ల కు 1.21 రూపాయల పన్ను ఉండగా , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం 99.8 శాతానికి పెంచి 120 రూపాయలు చేశారన్నారు.

ప్రజలకు ఏమి సమాధానం చెబుతారు?
గడపగడపకు వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమంలో ప్రజలు అడిగే ప్రశ్నలకు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఏమి సమాధానం చెబుతారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. చెత్త పన్ను, లెట్రిన్ పన్ను, కరెంటు కోతలు, విద్యుత్ చార్జీల పెంపు వంటి వాటిపై ప్రజలు ప్రశ్నిస్తే… ఎమ్మెల్యేలు ఏమి సమాధానం చెప్పగలరని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలాగో బయటికి రారని, గడపగడపకు వెళ్లే 150 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటన్నారు. పోలీసు రక్షణ మధ్య మాత్రమే గడపగడపకు కార్యక్రమం చేపట్టాలన్న ఆయన, కొన్ని రోజులు ఆలస్యం అయినా పర్వాలేదు కానీ ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే లా తర్ఫీదు నిచ్చి పంపితే బాగుంటుందన్నారు. తనకు ఇబ్బందేమీ లేనందుకు సంతోషంగా ఉన్నదని చెప్పారు.

కార్పొరేషన్ల పేరిట అప్పులా?
కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అప్పులు చేయడం పై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుడుగాని పరిగణించాల్సి ఉంటుందని చెప్పారన్నారు.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కార్పొరేషన్గా పేరిట ఇప్పటికే పెద్దమొత్తంలో అప్పులు చేశాయన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల కాసింత కటువుగానే ఉన్నా కేంద్రం, ఏపీ పట్ల రాష్ట్రపతి ఎన్నికలు ముగిసేవరకు ఉదార వైఖరితో వ్యవహరించే అవకాశం ఉందన్నారు.

న్యాయవాది సమక్షంలోనే నారాయణను విచారించాలి
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ ను అరెస్టు చేయడం పట్ల రఘురామకృష్ణంరాజు తీవ్ర నిరసన తెలియజేశారు.. రాజధాని భూసేకరణ అంశం తో పాటు, పదవ తరగతి ప్రశ్నా పత్రాలు లీకేజీ వ్యవహారం లో లో నారాయణ విద్యాసంస్థల హస్తం ఉందని కేసు నమోదు చేశారన్నారు. వివిధ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసు ఈ వివరాలను ఆయన తెలియజేశారు.

న్యాయవాది సమక్షంలోనే, సెక్యూరిటీ సిబ్బంది ఉండగానే పోలీసు విచారణ జరిగే విధంగా స్థానాన్ని ఆశ్రయించి ఉత్తర్వులను సంపాదించాలని నారాయణ సన్నిహితులకు రఘురామ సూచించారు. లేకపోతే భౌతికంగా దాడులు చేసే ప్రమాదం ఉందని చెప్పారు. గతంలో తనపై అలాగే దాడులు చేశారని వివరించారు.

LEAVE A RESPONSE