విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ తల్లిదండ్రులకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 22న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పీవీ.రమేశ్ తల్లిదండ్రులు ఆరోపించారు.
విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ తల్లిదండ్రులకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని సుబ్బారావు, మణి ఇంటికి వెళ్లిన ఏపీ పోలీసులు.. నోటీసులు అందజేశారు. ఈ నెల 22న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విజయవాడ పటమట పీఎస్‌లో విచారణకు
రావాలని స్పష్టం చేశారు. 2018లో నమోదైన గృహహింస కేసుకు సంబంధించి తమ ముందు విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పీవీ రమేశ్ తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు సంబంధంలేని కేసులో ఇరికిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు.