సీఎం కేసీఆర్ జాతకం బాగాలేదని,డౌన్ ఫాల్ ప్రారంభం అయిందని అంటావా…

• బండి సంజయ్..! మీరు జ్యోతిష్యం నేర్చుకున్నారా..?
•• సంజయ్.. నవ్వుల పాలు కావద్దూ
• సీఎం కేసీఆర్ జాతకం చాలా బాగుంది
• ” మన ఊరు.. మన బడి ” వినూత్న కార్యక్రమం
• ఈ కార్యక్రమంతో బడుల దశ మారనుంది
• మాతృభాష తెలుగు విధిగా ఉంటుంది.. ఇంగ్లీష్ మీడియమూ ఉంటుంది
• విపక్ష నేతలుగా బండి సంజయ్, రేవంత్ రెడ్డి ప్రతి దానికీ విమర్శించడం సరికాదు.. నిర్మాణాత్మక సూచనలు ఇవ్వండి
• రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ 
• వినోద్ కుమార్ తో ఎస్సీ, ఎస్టీ మేధావుల ఫోరం ప్రతినిధుల భేటీ
• మన ఊరు – మన బడి కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ మేధావుల ఫోరం సంపూర్ణ మద్దతు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..! జ్యోతిష్యం నేర్చుకున్నావా. రాజకీయాలు మానుకుని జాతకాలు చెబుతున్నారు. సమాజంలో నవ్వులపాలు కావద్దూ.. అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు.బుధవారం మంత్రుల నివాసంలో ఎస్సీ, ఎస్టీ మేధావుల ఫోరం ప్రతినిధులు వినోద్ కుమార్ తో భేటీ అయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ” మన ఊరు – మన బడి ” కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ మేధావుల ఫోరం ప్రతినిధులు సంపూర్ణ మద్దతు పలికారు.ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యజ్ఞంలా చేపట్టిన మన ఊరు – మన బడి, స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధన కార్యక్రమాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేయడంపై స్పందించారు.బండి సంజయ్.. సీఎం కేసీఆర్ జాతకం బాగా లేదంటారు. సీఎం కేసీఆర్ జాతకం చాలా బాగుంది. బండి సంజయ్ జ్యోతిష్యం ఎప్పుడు నేర్చుకున్నారు.. అని ఆయన ప్రశ్నించారు.

మన ఊరు – మన బడి, ఇంగ్లీష్ మీడియంలో బోధన రాష్ట్ర ప్రభుత్వ వినూత్న కార్యక్రమాలు. ప్రైవేటు స్కూల్స్ నుంచి డబ్బులు వసూలు కోసం ఇంగ్లీష్ మీడియం బోధన అంటూ బండి సంజయ్ విమర్శలు చేశారు. తలా తోక లేకుండా బండి సంజయ్ ఇలా అనాలోచిత వ్యాఖ్యలు చేస్తే మీ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోరు.. అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.మన ఊరు – మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల దశ మారనుంది అని ఆయన అన్నారు.

విపక్ష నాయకులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిని విమర్ధించడమే పనిగా పెట్టుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. విపక్ష నాయకులుగా నిర్మాణాత్మక సూచనలు చేయాలి.. అని వినోద్ కుమార్ వివరించారు.నీళ్లు, విద్యుత్ పుష్కలంగా అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం విద్యా, వైద్యం ప్రధాన అంశాలు అని వినోద్ కుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ట్రైబల్ మేధావుల ఫోరం అధ్యక్షులు డా. ఎం. ధనాంజయ్ నాయక్, ప్రధాన కార్యదర్శి డా. జీ. హరిచరన్, వైస్ ప్రెసిడెంట్ డా బీ. రమణ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ డా. రవితేజ, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎస్సీ మేధావుల ఫోరం ప్రెసిడెంట్ ఆరేపల్లి రాజేందర్, ప్రసాద్, తదితరులు కూడా ఉన్నారు.

Leave a Reply