Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ పోలీసులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ప్రశంసాపత్రం

– ఈ అవార్డు ఏపీ పోలీసులు కు రావడం ఇది రెండోసారి
– చంద్రబాబు నాయుడు విజన్ ఫలితమే: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

అమరావతి : రాష్ట్ర ప్రజల పాస్‌పోర్ట్ కలలకి వేగంగా అండగా నిలుస్తూ , సమర్ధవంతమైన వెరిఫికేషన్ ప్రక్రియతో దేశవ్యాప్తం గా అత్యుత్తమంగా నిలిచినందుకు గాను భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖకు ప్రతిష్టాత్మకమైన “సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నైజెషన్ “ను ప్రదానం చేసింది.

జూన్ 23 నుండి 25 వరకు ఢిల్లీలో నిర్వహించిన 13 వ పాస్‌పోర్ట్ సేవా దినోత్సవం లో ఈ అవార్డును అందజేసింది. ఒక సంవత్సర కాలం లో 6.25 లక్షల పోలీస్ వెరిఫికేషన్లు: ఏపీ పోలీసు శాఖ మరొకసారి తన కార్యదక్షతను చాటింది .దేశ వ్యాప్తంగా అత్యుత్తమ పనితీరుతో మెప్పించి, కేవలం ఒక సంవత్సర కాలం లో 6.25 లక్షల పోలీస్ వెరిఫికేషన్ నివేదికలు పూర్తి చేయడం లో రికార్డు నెలకొల్పింది.

రాష్ట్రానికి మూడు అవార్డులు :

ఈ కార్యక్రమం లో ఏపిల‌కి మొత్తం మూడు విభాగాలలో అవార్డులను అందుకుంది:

1. పోలీసు విభాగం అవార్డు : రాష్ట్ర పోలీసు శాఖ – వేగవంతమైన వెరిఫికేషన్ గుర్తింపు

2.ఇన్ స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు (పోస్టల్): గుంటూరు పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (POPSK)

3. ఇండివిడ్యూవల్ రికగ్నైజెషన్ అవార్డు: విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి (RPO)

మళ్ళీ రెండోసారి ఘనత : ఈ అవార్డు ఏపీ పోలీసులు కు రావడం ఇది రెండోసారి, గతంలో 2018-19 లో కూడా రాష్ట్రానికి ఇదే గుర్తింపు లభించింది .

ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ … “ఇది కేవలం పోలీసు శాఖ విజయమే కాదు. రాష్ట్ర ప్రజలకి సమర్ధవంతమైన సేవలు అంధించాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ ఫలితమే” అని అన్నారు.

అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్) తో పాటు రాష్ట్రంలోని సిపిలు (CsP) , ఎస్పీల(SsP) లు కూడా ఈ విజయం సాదించడంలో కీలక పాత్ర పోషించారని డీజీపీ హర్షం వ్యక్తం చేస్తూ వారిని ప్రత్యేకంగా అభినందించారు.

LEAVE A RESPONSE