Suryaa.co.in

Andhra Pradesh

డిప్యూటీ సీఎంకు “ఆప్తా” ఆహ్వానం

  • ఆగస్ట్ 30,31 తేదీల్లో అమెరికాలో ఆప్తా 16వ వార్షికోత్సవం

  • జనవరి 4,5 తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్ లో బిజినెస్ కాన్ఫరెన్స్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి ఈ నెల 30,31 తేదీల్లో అమెరికాలో జరిగే అమెరికన్ ప్రోగ్రెసీవ్ తెలుగు అసోసియేషన్ (ఆప్తా) 16వ వార్షికోత్సవ వేడుకలకు ఆహ్వానం వచ్చింది. ఆప్తా ప్రతినిధుల బృందం ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని కలిసి ఆహ్వానం అందచేశారు.

దీంతో పాటు ఆప్తా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ ఆధ్వర్యంలో 2025 జనవరి 4,5 తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్ లో జరిగే గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ కు ఆహ్వానం పలికారు. పదహారు సంవత్సరాల నుండి తమ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు వివరించారు.
ఈ బృందంలో అవనిగడ్డకు చెందిన ప్రవాస భారతీయులు “ఆప్తా” బిజినెస్ ఫోరమ్ చైర్ రమేష్ తూము (యూఎస్ఏ), ఎస్.వీ.ఎల్ క్రాంతి విద్యాసంస్థ చైర్మన్ దుట్టా ఉమా మహేశ్వరరావు ఉన్నారు.

LEAVE A RESPONSE