– సమస్యకు ప్రపంచ మార్కెట్ పరిస్థితులే కారణమైనా నెపం సర్కారుపై రుద్దే యత్నం!
– రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తాజా దుష్ప్రచారానికి తెలుగుదేశం ఇప్పుడు ఆక్వాకల్చర్ (చేపలు, రొయ్యల పెంపకం) రంగాన్ని ఆయుధంగా ఎంచుకుంది. భారీ స్థాయిలో లాభావకాశాలతోపాటు అనేక ఇబ్బందులుకు ఆస్కారం ఉన్న సాగురంగం రొయ్యల పెంపకం. దాదాపు పూర్తిగా ఎగుమతులపై ఆధారపడిన ఆక్వారంగం ప్రస్తుతం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. 2020 ఆరంభంలో కరోనావైరస్ ప్రంపంచవ్యాప్తంగా విజృభించడం అనేక పారిశ్రామిక రంగాలు, సాగు రంగాలతోపాటు రొయ్యల సాగు కూడా తీవ్ర సంక్షోభంలో పడింది.
కొవిడ్–19 మహమ్మారి సద్దుమణిగిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఈ రంగం కోలుకోలేకపోయింది. అంతర్జాతీయ పరిమాణాల వల్ల రొయ్యల ఎగుమతి ధరలు బాగా పెరగడం, అనూహ్య స్థాయిలో తగ్గిపోవడం కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. ఈ ఏడాది వేసవి నాటికి ఆక్వారంగం మరోసారి తీవ్ర సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితులు కనిపించాయి. రొయ్యల ఎగుమతుల విషయంలో లాటిన్ అమెరికా దేశమైన ఈక్వడార్ నుంచి తీవ్ర పోటీ ఎదురౌతోంది. ఏపీ నుంచి రొయ్యలు పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకునే చైనా తన విధానం మార్చుకుంది.
మన రాష్ట్రం నుంచి రొయ్యల దిగుమతులను నిలిపివేయడంతో ఆక్వారంగం మరోసారి సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఎగుమతి మార్కెట్లో రొయ్యల ధర బాగా పతనమైంది. రొయ్యల పెంపకానికి తాత్వాలికంగా స్వస్తి పలకాలనే ఆలోచన ఆక్వా రైతులకు ఏడాది జూన్–జులై మాసాల్లోనే వచ్చింది. చైనాకు ఎగుమతులు ఆగిపోవడం, రొయ్యల మేత సరఫరాలో సమస్యలు వంటి అనేక ఇబ్బందులు ఆక్వా రంగాన్ని కుంగదీస్తున్నాయి.
అయినా, వైఎస్ జగన మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటూ ఆక్వారంగాన్ని ఆదుకోవడానికి ప్రయత్నిస్తోంది. చేపలు, రొయ్యల సాగులో నష్టాలు, ఇబ్బందులు నివారించడానికి ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా సిద్ధమౌతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఈ నెల 18న శుక్రవారం ముఖ్యమంత్రి శంకుస్థాపనకు కార్యక్రమం కూడా ఖరారైంది. అదే రోజు రూ.13.58 కోట్ల వ్యయంతో నర్సాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద నిర్మించే ఫిషింగ్ హార్బర్‌కు కూడా శంకుస్థాపన చేస్తారు. ఆక్వారంగం చాలా వరకు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నియంత్రణలో ఉంటుంది. అయినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రంగాన్ని కాపాడడానికి తనకు చేతనైనన్ని అన్ని చర్యలు తీసుకుంటోంది.
భారీ పెట్టుబడులతోపాటు ఊహించనలవి కాని ఇబ్బందులు ఎదురయ్యే రొయ్యల పెంపకం రంగంలోని సమస్యల పరిష్కారంపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించింది. మరోవైపు, ఆక్వా యూనివర్సిటీ స్థాపన, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వంటి మౌలిక సౌకర్యాలను పెంచడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో, ఆక్వారంగంలో ప్రస్తుత సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నట్టు తెలుగుదేశం మాట్లాడడం నిరాధార ఆరోపణ మాత్రమే. ఆక్వా రైతులకు తమ కళ్ల ముందు పరిస్థితులపై అవగాహన ఉన్నందున టీడీపీ నేతల అబద్ధాలను నమ్మేవారు లేరు.