అమరావతి: అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారు అడ్డంగా దొరికిపోతున్నారు. నెలకు రూ.15వేలు, రూ.6 వేల చొప్పున పింఛన్ పొందేవారిలో అక్రమార్కుల గుట్టు బయటపడుతోంది. నెలకు రూ.15 వేల పింఛన్ పొందే వారిలో 19 వేల మంది వివరాలను వైద్యబృందాలు తాజాగా ఆన్లైన్లో నమోదుచేశాయి. వాటిని సెర్చ్ అధికారులు విశ్లేషించగా, 3 వేల మంది ఆ మేర పింఛన్ పొందేందుకు యోగ్యులు కారని తేలింది.